ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్‌కు కోహ్లీ జట్టంటే అంత ఇష్టమా

ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్‌కు కోహ్లీ జట్టంటే అంత ఇష్టమా

ఐపీఎల్ అంటే ప్రపంచమంతటా విపరీతమైన క్రేజ్ ఉన్నమాట వాస్తవమే. మరి ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లకు కూడా అంతపిచ్చి ఉందా.. డానియేల్ వ్యాట్ ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్‌కు ఐపీఎల్‌లో ఆ జట్టంటే పీక్స్‌లో అభిమానమట. ప్రత్యేకించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొస్తుంది. 

ఇటీవల ఇంగ్లాండ్ మహిళా జట్టు భారత పర్యటన పూర్తి చేసుకుని 3-0తేడాతో గెలుపొందింది. పర్యాటక జట్టు కీకల ప్లేయర్ రాబోయే సీజన్ ను ఉద్దేశించి మాట్లాడింది. తనకు ఐపీఎల్ అంటే ఎంత అభిమానమోననే సంగతి వెల్లడించింది. గతంలోనూ విరాట్ కోహ్లీని ట్విట్టర్ వేదికగా పెళ్లి చేసుకొమ్మని ప్రపోజ్ చేసింది.

మరి ఆ అభిమానం అక్కడితో ఆగిపోతుందా.. ఐపీఎల్‌లోనూ కోహ్లీ కెప్టెన్సీ వహిస్తోన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టంటే తనకెంతో ఇష్టమని వెల్లడించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే.. వ్యాట్ ను ఇండియన్ అభిమాని ఒకరు నీకు ఐపీఎల్ లో ఏ జట్టంటే బాగా ఇష్టమని ప్రశ్నించాడు. దానికి వ్యాట్… ఆర్సీబీ.. ఆర్సీబీ అని పాడుతున్నట్లుగా సింబళ్లు పెట్టి పోస్టు చేసింది.