IPL 2020, SRH Vs DC: సీజన్‌లో ఫస్ట్ విక్టరీ.. ఢిల్లీపై హైదరాబాద్ ఘన విజయం

[svt-event title=”ఢిల్లీపై హైదరాబాద్ ఘన విజయం” date=”29/09/2020,11:27PM” class=”svt-cd-green” ] ఢిల్లీపై హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 163పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీని హైదరాబాద్ జట్టు 147పరుగులకే కట్టడి చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 15పరుగుల తేడాతో విజయం సాధించింది. [/svt-event]
[svt-event title=”3వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్” date=”29/09/2020,10:31PM” class=”svt-cd-green” ] 163పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆచితూచి ఆడుతుంది. అయితే ఆదిలోనే కీలకమైన రెండు వికెట్లను కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. రెండు పరుగులు చేసి పృద్వీ షా అవుట్ అవగా.. 17పరుగులు చేసి శ్రేయాస్ అయ్యర్ అవుట్ అయ్యాడు. తర్వాత దావన్ 34పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో హెట్మేయర్, పంత్ ఉన్నారు. 13ఓవర్లు ముగిసేసరికి 3వికెట్లు నష్టపోయి 78పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. [/svt-event]
[svt-event title=”ఢిల్లీ టార్గెట్ 163″ date=”29/09/2020,9:34PM” class=”svt-cd-green” ] రెండు మ్యాచ్‌లు ఓటమి తర్వాత హైదరాబాద్ సత్తా చాటింది. అబుదాబి వేదికగా ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో నిర్ణీత 20ఓవర్లలో 4వికెట్లు నష్టపోయి ఢిల్లీకి 163 పరుగుల టార్గెట్ నిర్దేశించింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్.. వార్నర్(45), బెయిర్ స్టో(53), విలియమ్సన్(41) ఆడడంతో గౌరవప్రదమైన స్కోరు చెయ్యగలిగింది. ఢిల్లీ బౌలర్లు రబడా 2వికెట్లు, అమిత్ మిశ్రా 2వికెట్లు తీయగలిగారు. [/svt-event]
[svt-event title=”బెయిర్ స్టో అవుట్.. 18ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 145/3″ date=”29/09/2020,9:16PM” class=”svt-cd-green” ] సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో వికెట్ కోల్పోయింది, బెయిర్‌స్టో అర్ధ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు. బెయిర్‌స్టో 48 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 2 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. ప్రస్తుతం 18ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 3వికెట్ల నష్టానికి 145పరుగులు చేసింది. [/svt-event]
[svt-event title=”రెండవ వికెట్‌గా పాండ్యా” date=”29/09/2020,8:44PM” class=”svt-cd-green” ] వార్నర్ వికెట్ కోల్పోయిన కాసేపటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ పాండ్యా వికెట్ కోల్పోయింది. అమిత్ మిశ్రా ఓవర్‌లోనే భారీ షాట్ ఆడబోయి పాండ్యా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
Amit Mishra with another big wicket of Manish Pandey.#DelhiCapitals two down with 92 runs on the board.
Live – https://t.co/doLGBBdMRq #DCvSRH #Dream11IPL pic.twitter.com/NFyEM5xkoi
— IndianPremierLeague (@IPL) September 29, 2020
పాండ్యా 5బంతుల్లో 3పరుగులు మాత్రమే చేశాడు. [/svt-event][svt-event title=”ఫస్ట్ వికెట్ డౌన్: వార్నర్ అవుట్” date=”29/09/2020,8:33PM” class=”svt-cd-green” ] ఫస్ట్ వికెట్‌గా వార్నర్ పెవిలియన్ చేరుకున్నాడు. అమిత్ మిశ్రా బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
[svt-event title=”SRH Vs DC LIVE స్కోరు:” date=”29/09/2020,8:07PM” class=”svt-cd-green” ] IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) – 8 ఓవర్ల తర్వాత, ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 59 పరుగులు చేసింది. బైర్‌స్టో 21 బంతుల్లో 24పరుగులు, డేవిడ్ వార్నర్ 27 బంతుల్లో 33పరుగులు చేశారు. ఢిల్లీ జట్టు వికెట్ కోసం చూస్తోంది. వార్నర్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు.
WATCH – Arrow straight – Warner style
In the slot and whacked straight down the ground by @davidwarner31. This is as straight as it gets.https://t.co/XpXaUSpDMT #Dream11IPL #DCvSRH
— IndianPremierLeague (@IPL) September 29, 2020
[/svt-event]
[svt-event title=”IPL 2020, DC vs SRH: నెమ్మెదిగా ఆడుతున్న హైదరాబాద్.. 5వ ఓవర్‌కు స్కోరు 25/0″ date=”29/09/2020,8:06PM” class=”svt-cd-green” ] సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ మొదలు పెట్టిన SRH నెమ్మెదిగా ఆడుతుంది. 5ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్.. 25పరుగులు మాత్రమే చేసింది.
Chinnodu and Peddodu ? pic.twitter.com/5I86JYxAlm
— SunRisers Hyderabad (@SunRisers) September 29, 2020
[/svt-event]

ఐపీఎల్ 13సీజన్ 11వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ జరగనుంది. నేటి మ్యాచ్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న జట్టుకు, చివరి స్థానంలో జట్టుకు మధ్య జరగనుంది. రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలిచి ఉండగా.. అదే సమయంలో, టోర్నమెంట్‌లో విజయం రుచి చూడని ఏకైక జట్టు హైదరాబాద్‌గా ఉంది.
అద్భుతమైన ఫామ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్:
అద్భుతమైన ఫామ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో స్కోరుబోర్డులో పెద్ద స్కోర్‌లను చూడటం సాధ్యమే అనిపిస్తుంది. గత మ్యాచ్‌లో షా 43 బంతుల్లో 64 పరుగులు చేయగా.. ధావన్, అయ్యర్ మరియు పంత్ పరుగులు సాధించారు, కానీ వారు తెలిసిన శైలిలో కాదు. ఈ మ్యాచ్‌లో, ఈ ముగ్గురు బ్యాట్స్ మెన్ ముఖ్యంగా పంత్ తన పాత ఫామ్‌లోకి తిరిగి రావాలని ఢిల్లీ కోరుకుంటుంది.
ఢిల్లీ బౌలింగ్‌లో చాలా బలంగా ఉంది. కాగిసో రబాడా, ఎన్రిక్ నార్ట్జ్ కూడా బాగా రాణిస్తున్నారు. అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా కూడా సమర్థవంతంగా ఆడుతున్నారు. అశ్విన్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నారు.
హైదరాబాద్ పరిస్థితి దయనీయమే:
హైదరాబాద్ గెలవడానికి బ్యాటింగ్ ఆర్డర్ సమస్యలను పరిష్కరించుకోవాలి. జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్ మరియు కొంతవరకు మనీష్ పాండే తరువాత, టీ 20 ఫార్మాట్ల అవసరాన్ని తీర్చగల మరియు వేగంగా స్కోరు చేయగల బ్యాట్స్ మాన్ జట్టుకు లేరు. మునుపటి రెండు మ్యాచ్‌లలోనూ హైదరాబాద్‌కు అదే లోపం కనిపించింది. వార్నర్, బెయిర్‌స్టో జట్టుకు మంచి స్కోరు ఇవ్వగలరు. కానీ ఇద్దరూ ముందుగానే అవుట్ అయితే, మంచి స్కోరు చేయడం జట్టుకు కష్టం.
మొహమ్మద్ నబీ కొంత వేగం చూపించగలడు, కానీ హైదరాబాద్‌కు ఆండ్రీ రస్సెల్, కీరన్ పొలార్డ్ వంటి ఆటగాడు కావాలి. ప్రియమ్ గార్గ్, వృద్దిమన్ సాహా, అభిషేక్ శర్మ ఈ పాత్రను పోషించలేరు. లోయర్ ఆర్డర్‌లో జట్టుకు అవసరమైన అనుభవం లేదు. హైదరాబాద్ ఇక్కడ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది.
బౌలింగ్ విషయానికొస్తే, హైదరాబాద్ మునుపటి సీజన్లలో ఉన్న పరిస్థితి లేదు. తక్కువ స్కోరును కూడా ఆదా చేసే సామర్థ్యం ఇంతకుముందు జట్టుకు ఉండేది. భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, రషీద్ ఖాన్ వంటి బౌలర్లు ఉన్నారు. కానీ, ఈ సీజన్‌లో వారి ప్రభావం అంతంత మాత్రమే.
టాప్-5 బ్యాట్స్మెన్లు:
ర్యాంక్ | ప్లేయర్ | పరుగులు |
---|---|---|
1. | కేఎల్ రాహుల్ | 222 |
2. | మయాంక్ అగర్వాల్ | 221 |
3. | ఫాఫ్ డు ప్లెసిస్ | 173 |
4. | సంజు సామ్సన్ | 159 |
5. | ఎబి డివిలియర్స్ | 134 |
ర్యాంక్ | ప్లేయర్లు | వికెట్లు |
---|---|---|
1. | మహ్మద్ షమీ | 7 |
2. | కగిసో రబాడ | 5 |
3. | సామ్ కుర్రాన్ | 5 |
4. | యుజ్వేంద్ర చాహల్ | 5 |
5. | ట్రెంట్ బౌల్ట్ | 5 |
Points Table:
జట్టు | ఆడినవి | గెలుపు | ఓడినవి | డ్రా | ఎన్ / ఆర్ | NET RR | PTS | |
---|---|---|---|---|---|---|---|---|
1. | ఢిల్లీ | 2 | 2 | 0 | 0 | 0 | +1.100 | 4 |
2. | రాజస్థాన్ | 2 | 2 | 0 | 0 | 0 | +0.615 | 4 |
3. | బెంగళూరు | 3 | 2 | 1 | 0 | 0 | -1.450 | 4 |
4. | పంజాబ్ | 3 | 1 | 2 | 0 | 0 | +1.498 | 2 |
5. | ముంబై | 3 | 1 | 2 | 0 | 0 | +0.654 | 2 |
6. | కోల్‌కతా | 2 | 1 | 1 | 0 | 0 | -0.767 | 2 |
7. | చెన్నై | 3 | 1 | 2 | 0 | 0 | -0.840 | 2 |
8. | హైదరాబాద్ | 2 | 0 | 2 | 0 | 0 | -0.730 | 0 |