IPL – 2020 : బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, X ఢిల్లీ క్యాపిటల్స్, బలబలాలు

IPL – 2020 : మరో బిగ్ ఫైట్ జరగనుంది. రెండు బలమైన జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయ్. దుబాయ్ వేదికగా.. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (Royal Challengers Bangalore) తో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capital)తో తలపడనుంది. సీజన్‌లో ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లాడిన రెండు టీమ్‌లు.. చెరో మూడు విక్టరీలతో దూసుకుపోతున్నాయి.
కోల్‌కతాతో జరిగిన లాస్ట్ మ్యాచ్‌లో శ్రేయస్.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి.. ఢిల్లీకి సూపర్బ్ విక్టరీ అందించాడు. ఇక.. రాజస్థాన్‌తో జరిగిన ఫైట్‌లో విరాట్ రెచ్చిపోయి ఆడాడు. లీగ్‌లో ఫస్ట్ మ్యాచ్ నుంచే శ్రేయాస్ చెలరేగుతుండగా.. రాజస్థాన్‌పై హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. హెడ్ టు హెడ్ రికార్డుల్లోనూ.. బెంగళూరుదే పైచేయిగా ఉంది. ఇప్పటిదాకా ఈ రెండు టీమ్‌లు.. 23 సార్లు తలపడగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 14 సార్లు గెలిచింది.
బ్యాటింగ్‌లో.. రాయల్ ఛాలెంజర్స్ సూపర్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. కోహ్లీ లాస్ట్ మ్యాచ్‌లో తన సత్తా చాటాడు. కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో.. టీమ్‌కు మరింత కలిసొచ్చే అంశం. ఫించ్, పడిక్కల్, డివిలియర్స్ అదరగొడుతున్నారు. ముఖ్యంగా.. యంగ్ ప్లేయర్ పడిక్కల్ వైపే అందరి అటెన్షన్ ఉంది. అతను ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడు అర్ధసెంచరీలు బాదాడు. ఇక బౌలింగ్‌లో చహల్ టాప్ ఫామ్‌లో ఉన్నాడు. మంచి ఏకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు. నవదీప్ సైనీ పదునైన బంతులతో బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా లీగ్‌లో అదరగొడుతోంది. బ్యాటింగ్‌లో చెలరేగి ఆడుతోంది. అందరీ అంచనాలను తలకిందులు చేస్తూ.. టోర్నీలో దూసుకెళ్తోంది. ఓపెనర్ పృథ్వీ షా లాస్ట్ మ్యాచ్‌లో సత్తా చాటాడు. మరో ఓపెనర్ ధవన్ ఫామ్‌లో లేకపోవడం టీమ్‌ను కలవరపెడుతోంది. కెప్టెన్ శ్రేయస్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. రిషబ్‌పంత్ కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు. హెట్‌మెయిర్, స్టోయినిస్ మరింత రాణిస్తే ఢిల్లీ బ్యాటింగ్‌కు తిరుగుండదు. ఇక బౌలింగ్‌లో రబాడతో పాటు నోర్జ్ సత్తా చాటుతుండడం ఢిల్లీకి ప్లస్‌గా మారింది.