IPL 2024 : చెలరేగిన శశాంక్.. గుజరాత్‌పై పంజాబ్ సంచలన విజయం

IPL 2024 : పంజాబ్ అదరగొట్టింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ లక్ష్య ఛేదనలో ఒక బంతి మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IPL 2024 : చెలరేగిన శశాంక్.. గుజరాత్‌పై పంజాబ్ సంచలన విజయం

Punjab Kings Beat Gujarat Titans by 3 Wickets

Updated On : April 5, 2024 / 12:11 AM IST

IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-17)లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం ఇక్కడ గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ కింగ్స్ (PBKS) ఒక బంతి మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ ఆటగాళ్లలో శశాంక్ సింగ్ (61; 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు)తో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు.

శశాంక్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు :
ఫలితంగా గుజరాత్‌‌పై పంజాబ్ 19.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులతో గెలుపొందింది. మిగతా పంజాబ్ ఆటగాళ్లలో ప్రభసిమ్రాన్ సింగ్ (35), జానీ బెయిర్ స్టో ( 22), అశుతోష్ శర్మ (31) పరుగులతో రాణించగా.. జితేశ్ శర్మ (16), సికందర్ రజా (15), శిఖర్ ధావన్ (1), సామ్ కరన్ (5), హర్ ప్రీత్ బ్రార్ (1) పేలవ ప్రదర్శనతో ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ చేరారు.

Read Also : Uppal Stadium : హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌కు షాక్‌..! అసలేం జరిగిందంటే..

గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే తలో వికెట్ తీసుకున్నారు. పంజాబ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శశాంక్ సింగ్‌ (61/29)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

హాఫ్ సెంచరీతో మెరిసిన శుభమాన్ గిల్ :
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లలో కెప్టెన్ శుభమాన్ గిల్ (89 నాటౌట్; 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో అద్భుతంగా రాణించాడు. మిగతా ఆటగాళ్లలో సాయి సుదర్శన్ (33), రాహుల్ తివాటియా (23), కేన్ విలియమ్సన్ (26) పర్వాలేదనిపించగా.. వృద్ధిమాన్ సాహా (11), విజయ్ శంకర్ (8)కే చేతులేత్తేశారు.

ఫలితంగా గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు పంజాబ్‌కు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడ రెండు వికెట్లు పడగొట్టగా, హర్ ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు.

Read Also : Uppal Stadium : లైన్ క్లియర్.. హైదరాబాద్ క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్