IPL 2025: ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్.. RR టార్గెట్ ఎంతంటే..
రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీశాడు. మహీశ్ తీక్షణ, హసరంగా చెరో వికెట్ తీశారు.

Courtesy BCCI
IPL 2025: ఐపీఎల్ 2025లో ఢిల్లీ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్తాన్ గెలవాలంటే 189 రన్స్ చేయాలి.
ఢిల్లీ జట్టులో ఓపెనర్ అభిషేక్ పొరెల్ ధాటిగా ఆడాడు. 37 బంతుల్లో 49 పరుగులు చేశాడు. అయితే ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. గత మ్యాచ్ లో విధ్వంసకర బ్యాటింగ్ చేసిన కరుణ్ నాయర్ ను ఈసారి దురదృష్టం వెంటాడింది. ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యాడు. అక్షర్ పటేల్ కెప్టెన్ ఇన్నింగ్ ఆడాడు. 14 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 38 పరుగులు, స్టబ్స్ 34 రన్స్ చేశారు.
Also Read : ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం? ఆ హైదరాబాదీతో జాగ్రత్త.. ఐపీఎల్ జట్లకు బీసీసీఐ హెచ్చరిక..!
కాగా, మెక్ గుర్క్ మరోసారి నిరాశపరిచాడు. రెండు ఫోర్లు కొట్టి ఊపుమీదున్నట్లు కనిపించినా.. 9 పరుగులకే ఔటయ్యాడు. ఈ సీజన్ లో 6 ఇన్నింగ్స్ ల్లో 55 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో హయ్యస్స్ 38 రన్స్. గతేడాది 9 ఇన్నింగ్స్ ల్లో 330 పరుగులు చేసిన ఈ హిట్టర్.. ఈసారి తేలిపోతున్నాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీశాడు. మహీశ్ తీక్షణ, హసరంగా చెరో వికెట్ తీశారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here