IPL 2025: హైదరాబాద్‌పై గుజరాత్ ఘన విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Courtesy BCCI
IPL 2025: హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. హైదరాబాద్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. 225 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
అభిషేక్ శర్మ 74 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ధ్ తలో రెండు వికెట్లు తీశారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్స్ టేబుల్ లో 4వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకింది. హైదరాబాద్ జట్టు 9వ స్థానంలో ఉంది.
స్కోర్లు:
గుజరాత్ – 20 ఓవర్లలో 224/6
హైదరాబాద్ – 20 ఓవర్లలో 186/6
Also Read: ఇదేం విచిత్రమో.. కొడుకు ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్.. తండ్రి ఆర్‌సీబీ ఫ్యాన్..! పిక్ వైరల్..