IPL 2025: ముంబై ఫ్యాన్స్‌కు శుభవార్త.. మైదానంలోకి దిగేందుకు సిద్ధమైన బుమ్రా.. ఆర్బీబీతో మ్యాచ్ లో ఆడతాడా.. ?
ఏప్రిల్ 7న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. ఆ మ్యాచ్ లో బుమ్రా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Jasprit Bumrah,
IPL 2025: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో సతమతమవుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడగా.. మూడు మ్యాచ్ లలో ఆ జట్టు ఓటమి పాలైంది. కీలక ప్లేయర్, టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరంకావటం కూడా ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. బుమ్రా ఉంటే ముంబై బౌలింగ్ బలోపేతం అవుతుందని, తద్వారా ప్రత్యర్థులను తక్కువ పరుగులకే కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. దీంతో బుమ్రా రాకకోసం ఎదురు చూస్తున్నారు. అయితే, బుమ్రా ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Also Read: IPL 2025: పంజాబ్ కింగ్స్ ఎవరి వల్ల ఓడిపోయింది..? కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఏం చెప్పాడంటే..
జస్ర్పీత్ బుమ్రా గావస్కర్ ట్రోఫీ చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయలేదు. ఆ తరువాత బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీలో నిపుణుల పర్యవేక్షణలో గాయం నుంచి కోలుకున్నారు. తాజాగా.. బుమ్రా నెట్స్ లోనూ ప్రాక్టీస్ చేశాడు. దీంతో ఐపీఎల్ సీజన్ లో అడుగు పెట్టేందుకు బుమ్రా సిద్ధమయ్యాడని క్రికెట్ వర్గాలు తెలిపాయి. బీసీసీఐ నుంచి అప్రూవల్ కూడా వచ్చినట్లు సమాచారం.
ఏప్రిల్ 7న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. ఆ మ్యాచ్ లో బుమ్రా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ‘గర్జించడానికి సిద్ధంగా ఉంది’ అని అర్ధం వచ్చేలా బుమ్రాకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో బుమ్రా భార్య సంజనా తమ కొడుకు అంగద్ కు తండ్రి ఐపీఎల్ ప్రస్తానాన్ని వివరిస్తుంది. దీంతో బుమ్రా ఎంట్రీ ఖాయమైందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆర్సీబీతో జరిగే మ్యాచ్ లో బుమ్రా ఎంట్రీ ఇవ్వకపోయినా.. ఆ తరువాత జరిగే మ్యాచ్ లో తుది జట్టులో చేరతాడని ముంబై జట్టు వర్గాలు పేర్కొంటున్నాయి.
𝑹𝑬𝑨𝑫𝒀 𝑻𝑶 𝑹𝑶𝑨𝑹 🦁#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL pic.twitter.com/oXSPWg8MVa
— Mumbai Indians (@mipaltan) April 6, 2025
బుమ్రా తుది జట్టులో చేరితే ముంబై బౌలింగ్ బలోపేతం కానుంది. ముంబయి పేస్ బౌలింగ్ ను కెప్టెన్ హార్దిక్ పాండ్యతో పాటు బౌల్ట్, దీపక్ చాహర్ నడిపిస్తున్నారు. దీపక్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడన్న వాదన ఉంది. స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ కూడా కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో విఫమవుతున్నాడు. ఇదే బుమ్రా ఉండుంటే పవర్ ప్లేతోపాటు డెత్ ఓవర్లలో వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బ కొట్టేవాడని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ప్రస్తుతం బుమ్రా ఎంట్రీపై క్లారిటీ రావడంతో ముంబై జట్టు గెలుపుబాట పడుతుందని జట్టు అభిమానులు భావిస్తున్నారు.