IPL 2025 Playoffs Scenario : ఆస‌క్తిక‌రంగా ప్లేఆఫ్స్ రేస్‌.. 10 జ‌ట్ల స‌మీక‌ర‌ణాలు ఇవే.. పోటీలో 8 జ‌ట్లు..

ఐపీఎల్ 2025 సీజ‌న్ దాదాపుగా చివ‌రి అంకానికి వ‌చ్చేసింది. ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠ‌గా మారింది. ఏ జ‌ట్టు అవ‌కాశాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..

IPL 2025 Playoffs Scenario : ఆస‌క్తిక‌రంగా ప్లేఆఫ్స్ రేస్‌.. 10 జ‌ట్ల స‌మీక‌ర‌ణాలు ఇవే.. పోటీలో 8 జ‌ట్లు..

Courtesy BCCI

Updated On : April 28, 2025 / 12:43 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో మ్యాచ్‌లు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. టోర్నీ ఆరంభంలో వ‌రుస ఓట‌ముల‌ను చ‌విచూసిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు అనూహ్యంగా పుంజుకుంది. వ‌రుస విజ‌యాల‌తో ప్లేఆఫ్స్ రేసుకు దూసుకువ‌చ్చింది. ఆదివారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పై 54 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఈ సీజ‌న్‌లో ఆ జ‌ట్టుకు వ‌రుస‌గా ఇది ఐదో విజ‌యం కావ‌డం విశేషం. అటు ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై విజ‌యం సాధించి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానానికి చేరుకుంది.

దీంతో ప్లే ఆఫ్స్ రేసు మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం ఏ జ‌ట్టుకు ప్లేఆఫ్స్ అవ‌కాశాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
ఢిల్లీ పై విజ‌యంతో ఆర్‌సీబీ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానాన్ని చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ జ‌ట్టు 10 మ్యాచ్‌ల్లో ఏడు విజ‌యాల‌ను సాధించింది. 14 పాయింట్లు ఆ జ‌ట్టు ఖాతాలో ఉన్నాయి. లీగ్ ద‌శ‌లో మ‌రో నాలుగు మ్యాచ్‌లు ఆర్‌సీబీ ఆడ‌నుంది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా ఆ జ‌ట్టుకు ప్లేఆఫ్స్‌కు అర్హ‌త సాధిస్తుంది. మూడు లేదా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిస్తే మాత్రం టాప్‌-2తో ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

గుజరాత్ టైటాన్స్..
గుజ‌రాత్ టైటాన్స్‌ 8 మ్యాచ్‌ల్లో 6 విజ‌యాల‌ను సాధించింది. 12 పాయింట్ల‌తో రెండో స్థానంలో కొన‌సాగుతోంది. లీగ్ ద‌శ‌లో మ‌రో 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో క‌నీసం మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.

SRH : ప్రాక్టీస్ వ‌దిలివేసి మాల్దీవుల‌కు చెక్కేసిన స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌.. కావ్య పాప మాస్ట‌ర్ ప్లాన్ అదేనా?

ముంబై ఇండియన్స్..
ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ఈ సీజ‌న్ ఆరంభంలో వ‌రుస ఓట‌ముల‌తో ఇబ్బంది ప‌డింది. ఆ త‌రువాత గ‌ట్టిగా పుంజుకుని వ‌రుస‌గా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు 10 మ్యాచ్‌లు ఆడ‌గా 6 విజ‌యాల‌ను సాధించింది. 12 పాయింట్ల‌తో మూడో స్థానంలో కొన‌సాగుతోంది. లీగ్ ద‌శ‌లో మ‌రో నాలుగు మ్యాచ్‌ల‌ను ముంబై ఆడ‌నుంది. ఇందులో క‌నీసం మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్ట‌నుంది.

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌..
ఈ సీజ‌న్‌లో అంచ‌నాల‌ను మించి రాణిస్తోంది ఢిల్లీ క్యాపిట‌ల్స్‌. ఇప్ప‌టి వ‌ర‌కు 9 మ్యాచ్‌ల్లో 6 విజ‌యాల‌ను సాధించింది. 12 పాయింట్ల‌తో నాలుగో స్థానంలో నిలిచింది. లీగ్ ద‌శ‌లో మ‌రో 5 మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా ఆ జ‌ట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

పంజాబ్ కింగ్స్..
ఇప్ప‌టి వ‌ర‌కు పంజాబ్ కింగ్స్ 9 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 5 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఓ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కావ‌డంతో ఆ జ‌ట్టు ఖాతాలో 11 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో నిలిచింది. లీగ్ ద‌శ‌లో పంజాబ్ మ‌రో 5 మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఇందులో నాలుగు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.

MI VS LSG : ముంబై పై ఘోర ఓట‌మి.. ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్ కు బీసీసీఐ బిగ్ షాక్‌..

లక్నో సూపర్ జెయింట్స్..
ఈ సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ప్ర‌యాణం ప‌డుతూ లేస్తూ సాగుతోంది. ఓ మ్యాచ్‌లో గెలిస్తే మ‌రో మ్యాచ్‌లో ఓట‌మి అన్న చందంగా సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 10 మ్యాచ్‌లు ఆడ‌గా 5 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆ జ‌ట్టు ఖ‌తాలో 10 పాయింట్లు ఉన్నాయి. ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది. లీగ్ ద‌శ‌లో మ‌రో నాలుగు మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఇందులో నాలుగుకు నాలుగు మ్యాచ్‌లు గెలిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్ట‌వ‌చ్చు. క‌నీసం మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా స‌రే ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవ‌కాశం ఉంది.

కోల్‌కతా నైట్ రైడర్స్..
డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగిన కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఇప్ప‌టి వ‌ర‌కు 9 మ్యాచ్‌లు ఆడ‌గా మూడు విజ‌యాల‌నే న‌మోదు చేసింది. ఓ మ్యాచ్ వ‌ర్షం కార‌నంగా ర‌ద్దైంది. 7 పాయింట్ల‌తో ఏడో స్థానంలో ఉంది. లీగ్ ద‌శ‌లో మ‌రో 5 మ్యాచ్‌ల‌ను కేకేఆర్ ఆడ‌నుంది. ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ విజ‌యం సాధిస్తేనే కేకేఆర్ ప్లేఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవంగా ఉంటాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్..
కేకేఆర్ లాగానే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు కూడా 9 మ్యాచ్‌ల్లో మూడు విజ‌యాల‌నే న‌మోదు చేసింది. లీగ్ ద‌శ‌లో మ‌రో 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండ‌గా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ స‌న్‌రైజ‌ర్స్ గెలివాల్సి ఉంది. అప్పుడే ప్లేఆఫ్స్ రేసులో ఆ జ‌ట్టు పోటీలో ఉంటుంది. మిగిలిన జ‌ట్ల స‌మీక‌ర‌ణాలు క‌లిసి వ‌స్తే ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్ట‌నుంది

రాజస్థాన్ రాయల్స్..
తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడు ఓడిపోవ‌డంతో రాజ‌స్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర‌మించింది. లీగ్ ద‌శ‌లో మ‌రో 5 మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో గెలిచిన‌ప్ప‌టికి ఆ జ‌ట్టు ఖాతాలో 12 పాయింట్లే ఉంటాయి.

MI vs LSG : నువ్వు కూడా సిక్స్ కొట్టావా.. పంత్ రియాక్ష‌న్ వైర‌ల్‌.. (వీడియో వైర‌ల్‌)

చెన్నై సూపర్ కింగ్స్..
రాజ‌స్థాన్ లాగానే ఐదు సార్లు ఛాంపియ‌న్ అయిన చెన్నై సూప‌ర్ కింగ్స్ సైతం ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర‌మిచింది. సీఎస్‌కే కూడా 9 మ్యాచ్‌లు ఆడ‌గా ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. లీగ్ ద‌శ‌లో మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచినా ఆ జ‌ట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేదు.