CSK vs PBKS : చెన్నై చిత్తు.. పంజాబ్ విక్టరీ.. ఫ్లేఆఫ్స్ రేసు నుంచి ధోనిసేన ఔట్..!
CSK vs PBKS : పంజాబ్ చేతిలో చెన్నై చిత్తుగా ఓడింది. వరుసగా 5 పరాజయాలను చవిచూసిన ధోనిసేన ఫ్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది.

CSK vs PBKS : Photo Credit : IPL (X)
CSK vs PBKS : ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గెలిచింది. పంజాబ్ చెన్నైని 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది.
ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా చెన్నై చెపాక్‌లో వరుసగా 5 పరాజయాలను చవిచూసింది. ముందుగా సామ్ కరన్ 88 పరుగులతో విజృంభించగా చెన్నై 19.2 ఓవర్లలో 190 పరుగులకే చేతులేత్తేసింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది.
యుజ్వేంద్ర చాహల్ (4/32) వికెట్లు తీయడం, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (41 బంతుల్లో 72 పరుగులు) అద్భుతమైన ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. చెపాక్‌లో 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కష్టమైన పని. అయినప్పటికీ, శ్రేయాస్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
జట్టులో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (54) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, పతిరణ తలో 2 వికెట్లు తీయగా, నూర్ అహ్మద్, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. ఈ టోర్నీలో చెన్నై 10 మ్యాచ్‌లు ఆడగా 8వ ఓటమిని చవిచూసింది. అయితే, పంజాబ్ జట్టుకు మాత్రం ఇది ఆరో విజయం. పంజాబ్ పాయింట్ల పట్టికలో 13 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది.