IPL 2025: ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్ నుంచి కోల్‌కతా ఔట్..

రెండు జట్లకూ చెరో పాయింట్ లభించింది.

IPL 2025: ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్ నుంచి కోల్‌కతా ఔట్..

Courtesy BCCI

Updated On : May 17, 2025 / 10:51 PM IST

IPL 2025: బెంగళూరు రాయల్ చాలెంజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ రద్దైంది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ ను రద్దు చేయాల్సి వచ్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ ను రద్దు చేయక తప్పలేదు. రెండు జట్లకూ చెరో పాయింట్ లభించింది. 13 మ్యాచుల్లో 12 పాయింట్లతో కేకేఆర్.. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. 17 పాయింట్లతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్ లో టాప్ లోకి వెళ్లింది. మరో 2 మ్యాచ్ లు ఉన్న బెంగళూరు.. ప్లే ఆఫ్స్ కు చేరడం ఇక లాంఛనమే.

Also Read: వాంఖ‌డే కార్య‌క్ర‌మం అనంత‌రం ఓ వ్య‌క్తిని తిట్టిన రోహిత్ శ‌ర్మ..! వీడియో వైర‌ల్‌..

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధంతో ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తొమ్మిది రోజుల తర్వాత IPL తిరిగి ఇవాళ ప్రారంభమైంది. అయితే, ఫ్యాన్స్ ఆనందంపై వరుణుడు నీళ్లు చల్లాడు. బెంగళూరులో భారీ వర్షం కారణంగా ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ రద్దైంది.