IPL2022 LSG Vs MI : శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. ముంబై టార్గెట్ 169
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ముంబై ముందు 169 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

Ipl2022 Lsg Vs Mi
IPL2022 LSG Vs MI : ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ముంబై ముందు 169 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.
IPL2022 KKR Vs GT : ఉత్కంఠపోరులో కోల్‌కతాపై గుజరాత్‌దే విజయం.. టాప్‌లోకి హార్ధిక్ గ్యాంగ్
లక్నో బ్యాటర్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీతో రాణించాడు. రాహుల్ 62 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 4 సిక్సులు, 12 ఫోర్లు ఉన్నాయి. లక్నో జట్టులో మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. ముంబై బౌలర్లలో కీరన్ పొలార్డ్, మెరిడీత్ తలో రెండు వికెట్లు తీశారు. డానియల్ సామ్స్, జస్ప్రీత్ బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు.(IPL2022 LSG Vs MI)
లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ శతకం బాదడంతో ఆ జట్టు అంత మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ సీజన్‌లో రాహుల్‌కి ఇది రెండో సెంచరీ కాగా.. ఓవరాల్‌గా నాలుగోది. లక్నో మిగతా బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (10), మనీశ్ పాండే (22), స్టొయినిస్ (0), కృనాల్ పాండ్య (1), దీపక్ హుడా (10), ఆయుష్ బదోనీ (14) పరుగులు చేశారు. హోల్డర్ (0) నాటౌట్‌గా నిలిచాడు.
For his brilliant show with the bat, @klrahul11 is our Top Performer from the first innings.
A look at his batting summary here ?? #TATAIPL pic.twitter.com/ZwlsUHwtyc
— IndianPremierLeague (@IPL) April 24, 2022
టీ20 లీగ్‌లో వరుసగా ఏడు మ్యాచుల్లో ఓడిన ముంబయి ఈ మ్యాచ్ లోనైనా గెలిచి బోణీ కొట్టాలని ఆశగా ఎదురు చూస్తోంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ముంబయి బౌలింగ్ ఎంచుకుని లక్నోకి బ్యాటింగ్ అప్పగించింది. మరోవైపు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది లక్నో జట్టు. ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే లక్నో జట్టు ప్రతి మ్యాచ్‌నూ గెలవాల్సిందే. వరుస ఓటములకు బ్రేక్ ఇచ్చి ముంబయి విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇకపోతే ఇవాళ ముంబై మెంటార్ సచిన్ బర్త్ డే. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి సచిన్ కు గిఫ్ట్ ఇవ్వాలని ముంబై ఆటగాళ్లు పట్టుదలగా ఉన్నారు.
IPL2022 RCB Vs SRH : హైదరాబాద్ జైత్రయాత్ర.. వరుసగా 5వ విజయం
జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్ టీమ్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, డేవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, హృతిక్ షోకీన్, డానియల్ సామ్స్, జయ్‌దేవ్ ఉనద్కత్, రిలే మెరెడిత్, బుమ్రా
లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ : క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), మనీశ్ పాండే, కృనాల్ పాండ్య, దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టొయినిస్, జాసన్ హోల్డర్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, మోహ్‌సిన్ ఖాన్
Innings Break!
An excellent knock of 103* from @klrahul11 propels #LSG to a total of 168/6 on the board.#MumbaiIndians chase coming up shortly. Stay tuned.
Scorecard – https://t.co/O75DgQTVj0 #LSGvMI #TATAIPL pic.twitter.com/obspFsm0PE
— IndianPremierLeague (@IPL) April 24, 2022