IPL2022 Rajasthan Vs GT : బట్లర్ బాదుడు.. గుజరాత్ ముందు భారీ టార్గెట్

రాజస్తాన్ బ్యాటర్లలో జోస్‌ బట్లర్ ‌(89) విజృంభించాడు. 56 బంతుల్లోనే 89 పరుగులు బాదాడు. కెప్టెన్ సంజూ శాంసన్‌ (26 బంతుల్లో 47 పరుగులు), పడిక్కల్ ‌(20 బంతుల్లో 28 పరుగులు) కూడా రాణించారు.

IPL2022 Rajasthan Vs GT : బట్లర్ బాదుడు.. గుజరాత్ ముందు భారీ టార్గెట్

Ipl2022 Rajasthan Vs Gt

Updated On : May 24, 2022 / 10:33 PM IST

IPL2022 Rajasthan Vs GT : ఐపీఎల్ 2022 సీజన్ 15లో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్ లో గుజరాత్‌ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. గుజరాత్‌కు 189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

De Villiers: ఐపీఎల్ రిటర్న్ కన్ఫామ్ చేసిన డివిలియర్స్

రాజస్తాన్ బ్యాటర్లలో జోస్‌ బట్లర్ ‌(89) విజృంభించాడు. 56 బంతుల్లోనే 89 పరుగులు బాదాడు. అతడి స్కోర్ లో 5 ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి. కెప్టెన్ సంజూ శాంసన్‌ (26 బంతుల్లో 47 పరుగులు), పడిక్కల్ ‌(20 బంతుల్లో 28 పరుగులు) కూడా రాణించారు. గుజరాత్‌ బౌలర్లలో షమీ, యశ్‌ దయాళ్‌, సాయి కిషోర్‌, హార్దిక్‌ పాండ్య చెరో వికెట్‌ తీశారు.

Jos Buttler

Jos Buttler

ఐపీఎల్ సీజన్ 15లో ప్లేఆఫ్స్‌లో సమరం మొదలైంది. తొలి క్వాలిఫయిర్‌లో గుజరాత్‌-రాజస్తాన్ తలపడుతున్నాయి. టాస్‌ నెగ్గిన గుజరాత్ కెప్టెన్‌ హార్దిక్ పాండ్య బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే ఓడిన టీమ్‌కు మరొక అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో తొలి క్వాలిఫయర్‌లో ఓడిన టీమ్‌ తలపడుతుంది. గుజరాత్‌ జట్టులో ఒక మార్పు జరిగింది. లాకీ ఫెర్గూసన్ స్థానంలో అల్జారీ జోసెఫ్‌ను తీసుకుంది. రాజస్తాన్‌ ఏ మార్పు లేకుండా బరిలోకి దిగింది.

ఈ సీజన్‌లో రాజస్తాన్‌ తొలిసారి బ్యాటింగ్‌ చేసినప్పుడు ఏడుసార్లు విజయం సాధించగా.. గుజరాత్ ఆరు సార్లు ఛేజింగ్‌లోనే గెలవడం విశేషం. మరోవైపు సంజూ శాంసన్‌ ఈ సీజన్‌లో కేవలం రెండు సార్లు మాత్రమే టాస్‌ను నెగ్గగా.. 13 సార్లు కోల్పోయాడు. దీంతో ఒకే సీజన్‌లో అత్యధికసార్లు టాస్‌ ఓడిన కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ రికార్డు సృష్టించాడు. సంజూ తర్వాత ఎంఎస్ ధోనీ (12సార్లు – 2012) (11సార్లు -2008), విరాట్ కోహ్లీ 11 సార్లు (2013) ఉన్నారు.

Rishabh Pant: రిషబ్ పంత్ నుంచి రూ.1.63కోట్లు లూటీ చేసిన హర్యానా క్రికెటర్