IPL2022 RCB Vs LSG : బెంగళూరు భళా.. లక్నోపై ఘన విజయం..

బెంగళూరు నిర్దేశించిన 182 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో 163 పరుగులకే పరిమితం అయ్యింది. దాంతో 18 పరుగుల తేడాతో..

IPL2022 RCB Vs LSG : బెంగళూరు భళా.. లక్నోపై ఘన విజయం..

Ipl2022 Rcb Vs Lsg

Updated On : April 19, 2022 / 11:54 PM IST

IPL2022 RCB Vs LSG : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు ఘన విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 182 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో 163 పరుగులకే పరిమితం అయ్యింది. దాంతో 18 పరుగుల తేడాతో ఆర్సీబీ విక్టరీ కొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లలో కృణాల పాండ్య ఒక్కడే రాణించాడు. 28 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీశాడు. సిరాజ్, మ్యాక్స్ వెల్ తలో వికెట్ తీశారు.

బెంగళూరు నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యఛేదనలో లక్నో చేతులెత్తేసింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులే చేసింది. ఫలితంగా బెంగళూరు 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (30), కృనాల్‌ పాండ్య (42), స్టొయినిస్‌ (24) మాత్రమే రాణించగా.. మిగిలిన వారందరూ విఫలమయ్యారు. బెంగళూరు విజయంలో ఆ జట్టు సారథి డుప్లెసిస్‌ (96), బౌలర్‌ జోష్ హేజిల్‌వుడ్‌ (4/25) కీలకపాత్ర పోషించారు.(IPL2022 RCB Vs LSG)

Virat Kohli: కోహ్లీ సెలబ్రేషన్స్‌కు షాక్ అయిన వార్నర్

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు సాధించిందంటే అందుకు కారణం కెప్టెన్ డుప్లెసిస్ ఇన్నింగ్సే. డుప్లెసిస్ దంచి కొట్టాడు. 64 బంతుల్లోనే 96 పరుగులు చేశాడు. దాంతో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసింది.

7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టును డుప్లెసిస్ ఆదుకున్నాడు. ఓపెనర్ అనుజ్ రావత్ 4 పరుగులకే అవుట్ కాగా, విరాట్ కోహ్లీ (0) తానెదుర్కొన్న మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లు దుష్మంత చమీర ఖాతాలోకి చేరాయి.

ఈ దశలో కెప్టెన్ డుప్లెసిస్ ఎంతో బాధ్యతాయుతంగా ఆడాడు. మ్యాక్స్ వెల్ (23), షాబాజ్ అహ్మద్ (26)ల సహకారంతో స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లాడు. 64 బంతులు ఆడిన డుప్లెసిస్ 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 96 పరుగులు చేశాడు. సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో హోల్డర్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి స్టొయినిస్ కు చిక్కాడు. లక్నో బౌలర్లలో దుష్మంత చమీర 2, జాసన్ హోల్డర్ 2, కృనాల్ పాండ్య 1 వికెట్ తీశారు. ఈ విజయంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి దూసుకెళ్లింది.

BCCI: “మహిళా క్రికెట్ జట్టు కోసం మగాళ్ల డ్రెస్సులు సైజ్ చేశారు”

జట్ల వివరాలు:

లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్‌ డికాక్‌, మనీశ్ పాండే, మార్కస్ స్టొయినిస్‌, దీపక్‌ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్య, జాసన్‌ హోల్డర్, దుష్మంత్ చమీర, అవేశ్‌ ఖాన్, రవి బిష్ణోయ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ : డుప్లెసిస్ (కెప్టెన్), దినేశ్ కార్తిక్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ప్రభుదేశాయ్‌, షాహ్‌బాజ్ అహ్మద్, వహిందు హసరంగ, హర్షల్ పటేల్, హేజిల్‌వుడ్, మహమ్మద్ సిరాజ్