ఆ మ్యాచ్ తర్వాత : 15 రోజులు ఏడ్చిన భారత బౌలర్

ఇషాంత్ వేసిన 48వ ఓవర్‌లో జేమ్స్ ఫాల్కనర్ 30 పరుగులు దండుకున్నాడు. ఆసీస్ సునాయాసంగా గెలిచేసింది. దీంతో 29 బంతుల్లో 64 రన్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించిన ఫాల్కనర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కింది. ఆ ఓవర్ ఇషాంత్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. మానసికంగా అతణ్ని కుంగదీసింది. 

ఆ మ్యాచ్ తర్వాత : 15 రోజులు ఏడ్చిన భారత బౌలర్

Updated On : January 22, 2019 / 5:12 AM IST

ఇషాంత్ వేసిన 48వ ఓవర్‌లో జేమ్స్ ఫాల్కనర్ 30 పరుగులు దండుకున్నాడు. ఆసీస్ సునాయాసంగా గెలిచేసింది. దీంతో 29 బంతుల్లో 64 రన్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించిన ఫాల్కనర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కింది. ఆ ఓవర్ ఇషాంత్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. మానసికంగా అతణ్ని కుంగదీసింది. 

సాధారణంగా క్రీడలంటే ప్రాణం పెట్టేస్తారు ప్లేయర్లు. క్రికెట్‌లోనూ అంతే. ఏమైనా సరే మ్యాచ్ గెలవాలంతే! యుద్ధాన్ని తలపించే క్రీడల్లో భావోద్వేగాలకు లోటు లేదు. గెలిచినప్పుడు ఎంత ఆనందం వ్యక్తం చేస్తారో ఓడినప్పుడు అంతే కుంగుబాటుకు గురవుతుంటారు. ఇలాగే ఆస్ట్రేలియాతో మూడో వన్డే అనంతరం ఇషాంత్ శర్మ ఒకటి కాదు రెండు కాదు 15రోజులు ఏడ్చాడట. అది ప్రస్తుతం ముగిసిన పర్యటన కాదు. 2013లో మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్. ఇందులో ఇషాంత్ ఒకే ఓవర్‌లో 30 పరుగులు సమర్పించుకున్నాడట. దీంతో ఆ బాధను తట్టుకోలేక లంబూ 15 రోజులపాటు ఏడ్చేశాడని స్వయంగా చెప్పుకొచ్చాడు.  

 

ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు వన్డేల అనంతరం 1-1తో రెండు జట్లు సమఉజ్జీలుగా నిలిచాయి. మూడో వన్డేలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 303 పరుగులు చేసింది. కంగారూల విజయానికి 18 బంతుల్లో 44 పరుగులు అవసరమున్న పరిస్థితుల్లో  అసాధ్యమనుకున్నారంతా. కానీ ఇషాంత్ వేసిన 48వ ఓవర్‌లో జేమ్స్ ఫాల్కనర్ 30 పరుగులు దండుకున్నాడు. దీంతో ఆసీస్ సునాయాసంగా గెలిచేసింది. తత్ఫలితంగా 29 బంతుల్లో 64 రన్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించిన ఫాల్కనర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కింది. ఆ ఓవర్ ఇషాంత్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. మానసికంగా అతణ్ని కుంగదీసింది. 

 

తన వల్లే జట్టు ఓడిందన్న బాధ నుంచి బయటకు రావడానికి చాలా కాలమే పట్టిందట. దాని నుంచి బయటకు తెచ్చేందుకు భార్య ప్రతిమా సింగ్, అతడి ఫ్రెండ్ రాజీవ్ మహాజన్ ఎంతగానో ప్రయత్నించారు. ఇషాంత్ అంతలా ఏడవడటం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని ప్రతిమా తెలిపారు. క్రికెటే జీవితం కాదు. అంతకు మించి జీవితానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలని చెప్పి అతణ్ని ఊరడించారట. ఆ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు రద్దు కాగా.. భారత్ 3-2తో సిరీస్ గెలిచింది. చివరి వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో జట్టును గెలిపించాడు. కానీ ఒకే ఓవర్లో 30 పరుగులు ఇచ్చినందుకు మూల్యంగా మూడో వన్డే తర్వాత ఇషాంత్‌ వేటుకు గురి అయ్యాడు.