KL Rahul: టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి రికార్డ్ బ్రేక్..
రాహుల్ టీ20 కెరీర్ లో 6 సెంచరీలు ఉన్నాయి. 69 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫార్మాట్ ఏదైనా..

Courtesy BCCI @IPL
KL Rahul: ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ టీ20ల్లో రికార్డ్ నెలకొల్పాడు. భారత్ తరపున అతి తక్కువ ఇన్నింగ్స్ లలో 8వేల పరుగులు పూర్తి చేసిన ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. 224 ఇన్నింగ్స్ లలో రాహుల్ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో రన్ మెషీన్ విరాట్ కోహ్లి బిగ్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు రాహుల్. విరాట్ రెండో స్థానంలో ఉన్నాడు. 243 ఇన్నింగ్స్ లలో విరాట్ 8వేల రన్స్ పూర్తి చేశాడు. ఓవరాల్ గా ఈ లిస్ట్ లో క్రిస్ గేల్ (213 ఇన్నింగ్స్), బాబర్ ఆజమ్ (218 ఇన్నింగ్స్) ముందు వరుసలో ఉన్నారు.
ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో కేఎల్ రాహుల్ చెలరేగాడు. సెంచరీతో కదం తొక్కాడు. 60 బంతుల్లోనే శతకం బాదాడు రాహుల్. ఈ క్రమంలోనే టీ20లలో హిస్టరీ క్రియేట్ చేశాడు. రాహుల్ టీ20 కెరీర్ లో 6 సెంచరీలు ఉన్నాయి. 69 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫార్మాట్ ఏదైనా కన్సిస్టెంట్ గా రాణిస్తున్నాడు రాహుల్.
గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. సెంచరీతో అజేయంగా నిలిచాడు. 65 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ లో 4 సిక్సులు, 14 ఫోర్లు ఉన్నాయి.
Also Read: పంజాబ్ కింగ్స్ విజయ దుందుభి.. ప్లేఆఫ్స్‌లో ఆ జట్టు చేరిక దాదాపు ఖరారైనట్లే.. ఎలాగంటే?
టీ20ల్లో వేగంగా 8000 పరుగులు చేసిన ప్లేయర్లు (ఇన్నింగ్స్ వారీగా)
క్రిస్ గేల్ – 213 ఇన్నింగ్స్
బాబర్ ఆజమ్ – 218 ఇన్నింగ్స్
కేఎల్ రాహుల్ – 224 ఇన్నింగ్స్
విరాట్ కోహ్లి – 243 ఇన్నింగ్స్
మహమ్మద్ రిజ్వాన్ – 244 ఇన్నింగ్స్