IND vs AFG : మళ్లీ టీ20ల్లోకి రోహిత్, కోహ్లీ.. అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక.. సంజు శాంస‌న్‌కు చోటు

అనుకున్న‌ట్లుగా టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ లు దాదాపు 14 నెల‌ల విరామం త‌రువాత అంత‌ర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టారు.

IND vs AFG : మళ్లీ టీ20ల్లోకి రోహిత్, కోహ్లీ.. అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక.. సంజు శాంస‌న్‌కు చోటు

Kohli and Rohit return to India T20I squad for Afghanistan series

Updated On : January 7, 2024 / 8:06 PM IST

India vs Afghanistan : అనుకున్న‌ట్లుగా టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ లు దాదాపు 14 నెల‌ల విరామం త‌రువాత అంత‌ర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టారు. 2022 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీ ఫైన‌ల్ మ్యాచులో వీరు ఇద్ద‌రు చివ‌రి సారి టీ20 మ్యాచ్ ఆడారు. అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచుల టీ20సిరీస్‌కు రోహిత్, కోహ్లీల‌ను సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. దీంతో ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్‌-అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లోనూ వీరు ఆడే అవ‌కాశాలు ఉన్నాయి.

గాయాల కార‌ణంగా సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్య‌, రుతురాజ్ గైక్వాడ్ దూరం కాగా ద‌క్షిణాప్రికా ప‌ర్య‌ట‌న‌లో రాణించిన పేస‌ర్లు బుమ్రా, సిరాజ్‌ల‌కు విశ్రాంతి ఇచ్చారు. ఇషాన్ కిష‌న్ విరామం తీసుకోవ‌డంతో సంజు శాంస‌న్‌ను ను ఎంపిక చేశారు. అత‌డితో పాటు జితేశ్ శ‌ర్మ‌కు అవ‌కాశం క‌ల్పించారు.

అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శుభ్‌మ‌న్‌ గిల్, య‌శ‌స్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), శివమ్ దూబే, వాషింగ్ట‌న్‌ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

T20 World Cup 2024 : టీమ్ఇండియా కెప్టెన్సీ అత‌డికే ఇవ్వాలి.. కోహ్లీ ఓ అద్భుత ఆట‌గాడు : గంగూలీ

అఫ్గానిస్తాన్ జ‌ట్టు ఇదే..

ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీప‌ర్‌), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీప‌ర్‌), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్, ఫజల్, ఫజల్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీమ్, కైస్ అహ్మద్, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్.

Flash Flood : ఇదేందిదీ.. వ‌ర్షం లేదు.. అయినా పిచ్ పై వ‌ర‌ద‌.. వీడియో వైర‌ల్‌

భారత్ vs అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..

* జ‌న‌వ‌రి 11న తొలి టీ20 – మొహాలి
* జ‌న‌వ‌రి 14న రెండ‌వ టీ20 – ఇండోర్‌
* జ‌న‌వ‌రి 17న మూడో టీ20 – బెంగ‌ళూరు