కోహ్లీ హైలెట్ సెంచరీ, 9వేల పరుగుల క్లబ్‌లో కెప్టెన్

కోహ్లీ హైలెట్ సెంచరీ, 9వేల పరుగుల క్లబ్‌లో కెప్టెన్

Updated On : March 5, 2019 / 11:20 AM IST

5 వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం రెండో వన్డేలో ఆస్ట్రేలియాతో తలపడుతోన్న భారత్.. వికెట్లు పడుతున్నా స్కోరు బోర్డు పరుగులు పెడుతూనే ఉంటుంది. మూడో వికెట్‌గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఆసీస్ బౌలర్లను సమయోచితంగా ఎదుర్కొంటూ బౌండరీలతో స్కోరును పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ చేసిన సెంచరీ అతని కెరీర్‌లోనే 40 వన్డే సెంచరీగా లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారత క్రికెటర్‌గా కోహ్లీ నిలిచిపోగా అగ్ర స్థానంలో సచిన్ టెండూల్కర్ నిలిచాడు. 
Also Read : INDvAUS: రెండో వన్డేలో ఈ రికార్డులు బద్దలయ్యేనా

2014-15‌లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో మహేంద్రసింగ్ ధోనీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న విరాట్.. కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 9వేల పరుగులు దండుకున్నాడు. వేగవంతంగా కేవలం 159 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా 164 ఇన్నింగ్స్‌ల్లో 7వేల పరుగుల కెప్టెన్సీ రికార్డ్ చేయగలిగాడు. 

మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీతో కలిపి ఇప్పటి వరకూ 6 మంది కెప్టెన్స్ మాత్రమే 9వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. ఇప్పటికే బ్యాట్స్‌మెన్‌గా వన్డే కెరీర్‌లో 10వేల పరుగుల మైలురాయిని కోహ్లీ దాటేసిన సంగతి తెలిసిందే. 
 

Also Read : IND Vs AUS వ్యూహాలేంటి : విదర్భ వేదికగా రెండో వన్డే