Shami : ప్రపంచ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాటర్, రోహిత్ శర్మ విధ్వంసకర ఆటగాడు.. మహ్మద్ షమీ
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అని, కెప్టెన్ రోహిత్ శర్మ పెను విధ్వంసకర ప్లేయర్ అని టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ తెలిపాడు.

Kohli Is Best Rohit Most Dangerous Batter In World says Mohammed Shami
Mohammed Shami : భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అని, కెప్టెన్ రోహిత్ శర్మ పెను విధ్వంసకర ప్లేయర్ అని టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ తెలిపాడు. వన్డే ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ చీలమండల గాయానికి గురైయ్యాడు. దీంతో ఈ మెగాటోర్నీ అనంతరం అతడు క్రికెట్‌కు దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం అతడు గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌కు అతడు అందుబాటులో లేడు.
కాగా.. ఇటీవల అతడు ఓ జాతీయ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అని చెప్పాడు. కోహ్లీ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడని అన్నారు. రోహిత్ శర్మ ఎంతో ప్రమాదకర బ్యాట్స్‌మెన్ అని చెప్పుకొచ్చాడు. షమీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Also Read: టీమ్ఇండియా కొంపముంచిన దక్షిణాఫ్రికా నిర్ణయం! రెండు రోజుల్లోనే మూడో స్థానానికి..
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడుతోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓడిపోగా, విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-1 సమంగా ఉంది. రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది.
కాగా.. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దూరం అయ్యాడు. అయితే.. మూడో టెస్టుకు అతడు అందుబాటులోకి రానున్నట్లు టెస్టు సిరీస్‌కు ముందు బీసీసీఐ తెలిపింది. అయితే.. అతడు అందుబాటులోకి వస్తాడా లేదా అన్న దానిపై ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది.
Also Read: చరిత్ర సృష్టించిన జస్‌ప్రీత్ బుమ్రా.. మొదటి భారత పేసర్