వన్డేల్లో కెప్టెన్‌గా మరో మైలురాయి దాటేసిన కోహ్లీ

వన్డేల్లో కెప్టెన్‌గా మరో మైలురాయి దాటేసిన కోహ్లీ

నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఆడిన రెండో వన్డేలో కోహ్లీ కెప్టెన్‌గా 9వేల పరుగుల మైలురాయి చేరుకున్న కెప్టెన్‌గా అరుదైన ఘనత దక్కించుకున్నాడు. మరోసారి కేవలం 3 రోజుల వ్యవధిలోనే రాంచీ వేదికగా జరుగుతోన్న మూడో వన్డేలో.. ఇంకో అరుదైన ఘనత దక్కించుకున్నాడు. కెప్టెన్‌గా 4వేల వన్డే పరుగులు పూర్తి చేసుకున్నాడు. 

ఈ ఘనతను కోహ్లీ అత్యంత వేగంగా కేవలం 63 ఇన్నింగ్స్‌లలోనే దక్కించుకోవడం విశేషం. దక్షిణాఫ్రికా క్రికెటర్ డివిలియర్స్ కెప్టెన్‌గా ఉండగా ఈ ఫీట్ సాధించడానికి 77 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 4వేల పరుగులు చేసిన 12వ క్రికెటర్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. 

కెప్టెన్లుగా వన్డే పరుగులు సాధించిన ఎంఎస్ ధోనీ(6641), మొహమ్మద్ అజారుద్దీన్(5239), సౌరవ్ గంగూలీ(5104)ల జాబితాలో కోహ్లీ కూడా చేరిపోయినట్లే.