వైభవ్ సూర్యవంశీ రికార్డు బద్దలు.. అభిషేక్ పాఠక్ సుడిగాలి ఇన్నింగ్స్.. 33 బంతుల్లో సెంచరీ..
మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా బుందేల్‌ఖడ్ బుల్స్, జబల్‌పూర్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ త్రిపాఠి 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.

Abhishek Pathak
Madhya Pradesh League 2025: మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ 2025లో సంచలనం చోటు చేసుకుంది. అభిషేక్ పాఠక్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. సిక్సులు, ఫోర్లతో చెలరేగిపోయాడు. దీంతో 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి వైభవ్ సూర్యవంశీ రికార్డును బద్దలు కొట్టేశాడు.
మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా బుందేల్‌ఖడ్ బుల్స్, జబల్‌పూర్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బుందేల్‌ఖండ్ బుల్స్ బ్యాటర్ అభిషేక్ పాఠక్ 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 48 బంతుల్లో 133 పరుగులు చేయగా.. ఇందులో 15 సిక్సులు, ఏడు ఫోర్లు ఉండటం విశేషం. దీంతో అతను సిక్సర్లతోనే 90 పరుగులు చేశాడు.
Also Read: IND vs ENG: అరెరే.. టీమిండియా కొంపముంచిన రవీంద్ర జడేజా.. సింపుల్ క్యాచ్ మిస్.. వీడియో వైరల్
33 బంతుల్లోనే అభిషేక్ పాఠక్ సెంచరీ పూర్తి చేయడం ద్వారా ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ రికార్డును బ్రేక్ చేశాడు. ఐపీఎల్ 2025లో సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ చేశాడు. అందులో 11 సిక్సర్లు ఉన్నాయి.
ఇదిలాఉంటే.. ఈ మ్యాచ్‌లో బుందేల్‌ఖండ్ బుల్స్ జట్టు విజయం సాధించింది. తొలుత బుందేల్‌ఖండ్ బుల్స్ జట్టు బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. ఇందులో అభిషేక్ త్రిపాఠి 133 పరుగులు చేయగా.. కరణ్ 45, గౌతమ్ జోషి 24 పరుగులు చేశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జబల్‌పూర్ రాయల్స్ జట్టు బ్యాటర్లు దూకుడుగా ఆడినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేక పోయారు. 19.1 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌట్ అయ్యారు.
View this post on Instagram
మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ.. నేను 13ఏళ్ల వయస్సులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించాను. గత సంవత్సరం కూడా నేను మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొని బాగా రాణించాను. త్వలోనే నేను ఐపీఎల్‌లో ఆడగలనని నేను అనుకోను. నాకు ఎక్కడ ఆడటానికి అవకాశం దొరికినా బాగా ఆడడం, ఎక్కువ పరుగులు చేయడం గురించే ఆలోచిస్తాను. సూర్యకుమార్ యాదవ్ తరహాలో స్థిరత్వం నేర్చుకోవాలని అనుకుంటున్నా అంటూ అభిషేక్ పాఠక్ తెలిపాడు.