Asia Cup 2023 : పాక్‌తో మ్యాచ్.. రోహిత్ ఆ ముగ్గురితో జాగ్రత్త.. ముఖ్యంగా షాహిన్‌తో..!
పాకిస్తాన్‌తో టీమ్ఇండియా తలపడుతుందంటే ఆ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మ్యాచ్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

Shaheen Afridi-Rohit Sharma
Asia Cup : పాకిస్తాన్‌తో టీమ్ఇండియా తలపడుతుందంటే ఆ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మ్యాచ్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆసియా కప్ 2023లో భాగంగా రేపు (శనివారం సెప్టెంబర్ 2న) శ్రీలంకలోని పల్లెకలె వేదికగా భారత్, పాకిస్తాన్ పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థిపై విజయం సాధించి ఆసియా కప్ 2023లో బోణీ చేయాలని సగటు భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ (Matthew Hayden) భారత బ్యాటర్లకు పలు కీలక సూచనలు చేశాడు.
నేపాల్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 238 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడం పాకిస్తాన్ జట్టు ఆత్మ విశ్వాసాన్ని పెంచేదే అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో అదే ఉత్సాహంతో టీమ్ఇండియాతో ఆడేందుకు పాక్ తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. అయితే.. ఆసియా కప్‌తో పాటు ఐసీసీ టోర్నమెంట్లలో పాక్‌పై బలమైన రికార్డును కలిగి ఉండడం టీమ్ఇండియాకు ఊరట నిచ్చే అంశం.
Mahika Gaur : ధోనిని ఆరాధించే క్రికెటర్.. చరిత్ర సృష్టించింది
పాక్‌ను తక్కువ అంచనా వేస్తే 2021 టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన దారుణమైన పరాభవాన్ని మరోసారి ఎదుర్కోవాల్సి వస్తుందని హెడెన్ తెలిపాడు. ఆ మ్యాచ్‌లో పాక్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టాప్ ఆర్డర్ బ్యాటర్లు అయిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి స్వల్ప వ్యవధిలోనే ఔట్ అయ్యారు. ఈ ముగ్గురిని పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది ఔట్ చేయడం గమనార్హం. ముఖ్యంగా రోహిత్ శర్మను ఔట్ చేసిన యార్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది.
ఈ విషయాన్ని భారత బ్యాటర్లు గుర్తుంచుకోవాలన్నాడు. పాక్ పేస్ త్రయం షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్, నసీం షాలతో జాగ్రత్తగా ఉండాలన్నాడు. పల్లెకలె లో పరిస్థితులు బౌన్స్‌కు అనుకూలించే అవకాశం ఉందన్నాడు. కాబట్టి రవూఫ్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఒక్కసారి అతడికి పిచ్‌పై పట్టు దొరికితే భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను అతలాకుతలం చేస్తాడని అన్నాడు.
అఫ్రిదితో జాగ్రత్త..
షాహిన్ అఫ్రిది బౌలింగ్ ఎదుర్కొనేటప్పుడు రోహిత్ శర్మ అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నాడు. అతడి బౌలింగ్‌లో మొదటి మూడు ఓవర్లను కాస్త చూసి ఆడాలని రోహిత్ కు సూచించాడు. అయితే.. పటిష్టమైన బ్యాటింగ్ కలిగిన టీమ్ఇండియా దూకుడైన ఆట తీరుతో పాక్ బౌలర్లపై ఒత్తిడి తీసుకురావాలని తద్వారా విజయం సాధించడం తేలిక అవుతుందన్నాడు.
Rinku Singh : సూపర్ ఓవర్‌లో రింకూ సింగ్ పెను విధ్వంసం.. హ్యాట్రిక్ సిక్సర్లు.. వీడియో వైరల్