కివీస్‌ను శాసిస్తున్న భారత బౌలర్లు, 25 ఓవర్లకు 95/3

25 ఓవర్లు పూర్తయినా న్యూజిలాండ్ వంద పరుగులు చేయలేకపోయింది. రెండో వన్డే జరిగిన వేదికపైనే మ్యాచ్ జరుగుతున్నా ఏ మాత్రం మైదానంపై పట్టు సాధించలేకపోయింది. మార్టిన్ గఫ్తిల్(13), కొలిన్ మన్రో(7), కేన్ విలియమ్సన్(28)లకు పెవిలియన్ చేరారు. భువనేశ్వర్ కుమార్, షమీ, చాహల్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.
హార్తిక్ పాండ్యా 5 ఓవర్లు బౌలింగ్ వేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ 2 ఓవర్లలో 6 పరుగులిచ్చి కివీస్‌ను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రతి మ్యాచ్‌లోనూ మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమవుతోన్నా కెప్టెన్ కేన్ విలియమ్సన్ చెప్పుకోదగ్గ స్కోరు చేసి జట్టును ఓ మాత్రంగా నిలిపేవాడు. కానీ, ఈ మూడో వన్డేలో కేవలం 28పరుగుల వద్ద అవుట్ అయి వెనుదిరగడంతో మూడో వన్డే టీమిండియా చేజిక్కినట్లే అనిపిస్తోంది.
25వ ఓవర్ ముగిసేసరికి క్రీజులో టామ్ లాథమ్(21), రాస్ టేలర్(23)తో ఉన్నారు. జట్టు స్కోరు 95/3