కివీస్ శాసించింది: ఘోర పరజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా

కివీస్ శాసించింది: ఘోర పరజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా

Updated On : February 6, 2019 / 10:27 AM IST

న్యూజిలాండ్‌తో తొలి టీ20లో తలపడిన భారత్‌కు చేదు అనుభవం మిగిలింది. వన్డే ఫార్మాట్ విజయానంతరం భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత్.. ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. లక్ష్య చేధనలో విఫలమైన రోహిత్ సేన.. పేలవంగా వికెట్లను చేజార్చుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా 220 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది. దీంతో 80 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయాన్ని కైవసం చేసుకుంది. అన్ని విభాగాల్లో ఫెయిలైన భారత్.. కివీస్ ధాటికి తట్టుకోలేక చేతులెత్తేసింది. 

 

చేధనలో భారత బ్యాట్స్‌మెన్ తీవ్రంగా నిరాశపరిచారు. ముగ్గురు వికెట్ కీపర్లతో బరిలోకి దిగిన రోహిత్ సేన తగ్గ మూల్యం చెల్లించుకుంది. ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ వికెట్ చేజార్చుకున్న టీమిండియా స్వల్య వ్యత్యాసంతోనే వికెట్లు పోగొట్టుకుంది. ధావన్(29), విజయ్ శంకర్(27), ఎంఎస్ ధోనీ(39), కృనాల్ పాండ్యా(20)లు తప్పించి మిగిలినవారంతా సింగిల్ డిజిట్ స్కోరుకే  పరిమితమైయ్యారు. టిమ్ సౌథీ 3 వికెట్లు పడగొట్టగా, ఫెర్గ్యూసన్, మిచెల్ శాంతర్, ఇషా సౌథీలు తలో 2 వికెట్లు పడగొట్టారు. డారిల్ మిచెల్‌కు కేవలం ఒక్క వికెట్ మాత్రమే దక్కింది. 

 

అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్.. టీమిండియాకు 220 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌పై కివీస్ ఓపెనర్లు విరుచుకుపడ్డారు. ఆరంభంలో కాస్త దూకుడు చూపించినా క్రమంగా పరుగుల వేగం తగ్గింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన టిమ్ సీఫెర్ట్(84) 43 బంతుల్లో; 7ఫోర్లు, 6 సిక్సులతో జట్టుకే హైలెట్‌గా నిలిచాడు. ఆఖరి వికెట్‌గా క్రీజులోకి వచ్చిన స్కాట్ కగ్లీజెన్ కూడా ధాటిగా ఆడి 7 బంతుల్లో 20 పరుగులు చేశాడు.  వికెట్లు తీయడంలో అంతగా రాణించలేకపోయిన భారత బౌలర్లు చాహల్, కృనాల్, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ తలో వికెట్ తీయగా, హార్దిక్ పాండ్యా మాత్రమే 2 వికెట్లు తీయగలిగాడు.