Pakistan : పాక్ త‌ల‌రాత‌ను మార్చేందుకు పీసీబీ కీల‌క నిర్ణ‌యం.. రిజ్వాన్‌, మ‌సూద్ పోస్ట్‌లు ఊస్ట్‌..! ఆల్‌రౌండ‌ర్‌కే మూడు ఫార్మాట్ల సార‌థ్యం..

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

Pakistan : పాక్ త‌ల‌రాత‌ను మార్చేందుకు పీసీబీ కీల‌క నిర్ణ‌యం.. రిజ్వాన్‌, మ‌సూద్ పోస్ట్‌లు ఊస్ట్‌..! ఆల్‌రౌండ‌ర్‌కే మూడు ఫార్మాట్ల సార‌థ్యం..

Salman Ali Agha

Updated On : June 9, 2025 / 4:36 PM IST

గ‌త కొంత‌కాలంగా పాకిస్థాన్ జ‌ట్టు అన్ని ఫార్మాట్ల‌లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేస్తోంది. ఈ క్ర‌మంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక్కొ ఫార్మాట్‌కు ఒక్కొ కెప్టెన్ కాకుండా అన్ని ఫార్మాట్ల‌కు ఒకే కెప్టెన్‌ను నియ‌మించేందుకు సిద్ధం అయిన‌ట్లు స‌మాచారం. అది కూడా ఆల్‌రౌండ‌ర్‌ను నియ‌మించాల‌ని భావిస్తుంద‌ట‌.

అత‌డు మ‌రెవ‌రో కాద‌ని, గ‌త కొన్నాళ్లుగా నిల‌క‌డ‌గా రాణిస్తున్న స‌ల్మాన్ అలీ అఘా అని స‌మాచారం. ఇప్ప‌టికే పాక్ టీ20 కెప్టెన్‌గా ఉన్న అత‌డు త్వ‌ర‌లోనే వ‌న్డే, టెస్టు జ‌ట్ల ప‌గ్గాలు అందుకోనున్నాడు. ప్ర‌స్తుతం వ‌న్డే కెప్టెన్‌గా రిజ్వాన్‌, టెస్టు కెప్టెన్‌గా షాన్ మ‌సూద్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అటు రిజ్వాన్‌, ఇటు మ‌సూద్‌లు విజ‌యాల‌ను అందించ‌లేక‌పోతుండ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా స‌ద‌రు వార్త‌ల సారాంశం.

Luckiest Batter : వ‌ర‌ల్డ్‌లోనే ల‌క్కీయెస్ట్ బ్యాట‌ర్ ఇత‌డే.. 98 పరుగుల వ‌ద్ద ఉండ‌గా..

మ‌సూద్ సార‌థ్యంలో పాక్ 12 టెస్టులు ఆడ‌గా ముచ్చ‌ట‌గా మూడు మ్యాచ్‌ల్లోనే విజ‌యం సాధించింది. మ‌రో 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్ల చేతిలో సిరీస్ వైట్‌వాష్‌లకు గురైంది. ఇక‌ రిజ్వాన్ కూడా త‌న‌దైన ముద్ర వేయ‌లేక‌పోయాడు. ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌ల‌ను పాక్ సొంతం చేసుకున్న‌ప్ప‌టికి ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో దారుణ ప్ర‌ద‌ర్శన చేసింది. లీగ్ స్టేజీలోనే ఇంటి ముఖం ప‌ట్టింది.

కొత్త హెడ్‌, కోచ్ మైక్ హెస్స‌న్ కూడా స‌ల్మాన్ వైపు మొగ్గు చూపతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. “స‌ల్మాన్‌ను ఆల్‌ఫార్మాట్ కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు సెల‌క్ష‌న్ క‌మిటీ, కొత్త హెడ్ కోచ్ హెస్స‌న్ ఆస‌క్తి చూపుతున్నారు. సల్మాన్ నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీని సైతం ఆక‌ట్టుకున్నాయి.’ అని పీసీబీ అధికారి ఒక‌రు పేర్కొన్న‌ట్లు జియో సూప‌ర్ వ‌ర్గాలు తెలిపాయి.

Prithvi Shaw : అరెరె.. ఐపీఎల్ అయిపోయినాక తుఫాన్ ఇన్నింగ్స్‌.. ఓ రెండు నెల‌ల ముందు ఇలా ఆడుంటే..

ఈ ఏడాది మార్చిలో పాక్ టీ20 కెప్టెన్‌గా స‌ల్మాన్ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. అతడి నాయ‌క‌త్వంలో పాక్‌.. జింబాబ్వే, బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లను సొంతం చేసుకుంది.