బెట్టింగ్‌కు పాల్పడ్డారా: ప్రపంచ కప్ విజేతపై అనుమానాలు
అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ముందుట పెను సవాల్ నిల్చొంది. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ప్రీతి పాత్రంగా భావిస్తూ (ఎఫ్ఐహెచ్)సరికొత్త ప్రాజెక్టును చేపట్టే ముందుగానే చిక్కొచ్చి పడింది. ఇటీవల ముగిసిన హాకీ వరల్డ్ కప్ 2018టోర్నీలో మోసం జరిగిందంటూ ఆరోపణలు బయటికొస్తున్నాయి.

అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ముందుట పెను సవాల్ నిల్చొంది. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ప్రీతి పాత్రంగా భావిస్తూ (ఎఫ్ఐహెచ్)సరికొత్త ప్రాజెక్టును చేపట్టే ముందుగానే చిక్కొచ్చి పడింది. ఇటీవల ముగిసిన హాకీ వరల్డ్ కప్ 2018టోర్నీలో మోసం జరిగిందంటూ ఆరోపణలు బయటికొస్తున్నాయి.
అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ముందుట పెను సవాల్ నిల్చొంది. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ప్రీతి పాత్రంగా భావిస్తూ (ఎఫ్ఐహెచ్)సరికొత్త ప్రాజెక్టును చేపట్టే ముందుగానే చిక్కొచ్చి పడింది. ఇటీవల ముగిసిన హాకీ వరల్డ్ కప్ 2018టోర్నీలో మోసం జరిగిందంటూ ఆరోపణలు బయటికొస్తున్నాయి. ఈ క్రమంలో బెల్జియం మీడియా (స్పోర్జా.బీ) పురుషుల హాకీ జట్టు అవినీతికి పాల్పడిందంటూ ప్రచారం చేస్తోంది. 2015 తర్వాత ప్రపంచ కప్ వరకూ విజయానికి నోచుకోని బెల్జియం భారత్‌లోని భువనేశ్వర్ వేదికగా జరిగిన ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచింది.
ఈ మేర జట్టులోని ఆటగాళ్లు/సిబ్బంది అవినీతికి పాల్పడుతూ బెట్టింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై న్యాయ విచారణ చేపట్టాలని బెల్జియం హాకీ అసోసియేషన్ గ్యాంబ్లింగ్ కమిటీని ఆశ్రయించింది. సంబంధింత అధికారి మాట్లాడుతూ.. ఆ వార్త పత్రికలలో ఉన్న విమర్శలపై పూర్తి స్థాయి పరిశీలన చేపడతామని అన్నారు. పోలీస్ తరహా పరిశోధన మాత్రం కాదని నిజాలు నిగ్గుతేలుస్తామని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఈ పరిశోధనలో తప్పులు దొర్లితే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
మరొక అధికార ప్రతినిధి ఎఫ్ఐహెచ్ సీనియర్ కమ్యూనికేషన్ మేనేజర్ నికోలస్ మాట్లాడుతూ.. ‘బెల్జియం హాకీ అసోసియేషన్‌ను సంప్రదించాం. పూర్తి స్థాయి మద్ధతును అందిస్తారని ఆశిస్తున్నాం. వదంతులలో నిజాలను బయటకి తీసుకొస్తాం’ అన్నారు. ప్రపంచ కప్‌ను బెల్జియం జట్టు ఫైనల్‌కు చేరడం అనూహ్యమే కాకుండా విజేతగా నిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా, జనవరి 19 శనివారం నుంచి జరగనున్న ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో బెల్జియం తన అరంగ్రేట మ్యాచ్‌ను స్పెయిన్ జట్టుతో ఆడనుంది.