Ricky Ponting : ఢిల్లీ కెప్టెన్‌గా పంత్ ఉండడా! కోచ్ పాంటింగ్ వ్యాఖ్యల వెనుక ?
ఐపీఎల్‌లో అన్ని మ్యాచులను పంత్ ఆడతా? లేదా? అనే అనుమానం చాలా మందిలో ఉంది.

Ponting says Pant is very confident of playing entire IPL 2024
Ricky Ponting-Rishabh Pant : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురి అయ్యాడు. అప్పటి నుంచి అతడు క్రికెట్‌కు దూరం అయ్యాడు. గాయాల నుంచి కోలుకున్న పంత్ ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ప్రాక్టీస్‌ను సైతం మొదలెట్టేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 తో పంత్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వస్తున్నాయి.
అయితే.. ఐపీఎల్‌లో అన్ని మ్యాచులను పంత్ ఆడతా? లేదా? అనే అనుమానం చాలా మందిలో ఉంది. ఐపీఎల్ ప్రారంభానికి మరో నెలరోజులే సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో పంత్ రీ ఎంట్రీ పై ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకున్నాడు. పంత్ ఖచ్చితంగా ఈ ఐపీఎల్‌లో ఆడుతాడని చెప్పాడు. అయితే.. అతడు వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించే అంశంపై స్పష్టత లేదన్నాడు. అదే సమయంలో అతడికి కెప్టెన్సీ అప్పగించే విషయంలోనూ క్లారిటీ లేదన్నాడు.
పంత్ ఓ అద్భుత ఆటగాడని పాంటింగ్ కితాడు ఇచ్చాడు. ఈ సీజన్‌లో అతడు ఆడతాడనే నమ్మకంతో ఉన్నట్లు చెప్పాడు. పంత్ బాగానే ఉన్నాడు. సోషల్ మీడియాలో అతడు పోస్ట్ చేస్తున్న వీడియోలను చూస్తుంటే.. గొప్పగా పరిగెడుతున్నాడు. కాగా.. మొదటి మ్యాచ్‌కు మరో ఆరు వారాల సమయం ఉంది. కాబట్టి అతడు రానున్న సీజన్‌లో వికెట్ కీపింగ్ చేస్తాడో లేదో చెప్పలేం. ఈ విషయం గురించి ఒకవేళ అతడిని అడిగితే.. ప్రతీ మ్యాచ్ ఆడతా, వికెట్ కీపింగ్ చేస్తా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగుతానని చెబుతాడు అని పాంటింగ్ అన్నాడు.
పంత్ గైర్హాజరీలో డేవిడ్ వార్నర్ 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించాడు. బ్యాటర్‌గా అతడు రాణించినప్పటికీ కెప్టెన్‌గా విఫలం అయ్యాడు. అతడి నాయకత్వంలో 14 మ్యాచులు ఆడిన ఢిల్లీ కేవలం ఐదు మ్యాచుల్లోనే విజయం సాధించింది. మిగిలిన మ్యాచుల్లో ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
Jasprit Bumrah : చరిత్ర సృష్టించిన జస్‌ప్రీత్ బుమ్రా.. మొదటి భారత పేసర్