Rafael Nadal : కరోనా బారినపడ్డ టెన్నిస్ స్టార్.. అక్కడి నుంచి రాగానే..

టెన్నిస్ స్టార్, స్పెయిన్ కు చెందిన రఫెల్ నాదల్ కరోనా బారిన పడ్డాడు. నాదల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా నాదల్ ట్విట్టర్ లో తెలిపాడు.

Rafael Nadal : కరోనా బారినపడ్డ టెన్నిస్ స్టార్.. అక్కడి నుంచి రాగానే..

Rafael Nadal

Updated On : December 20, 2021 / 5:20 PM IST

Rafael Nadal : టెన్నిస్ స్టార్, స్పెయిన్ కు చెందిన రఫెల్ నాదల్ కరోనా బారిన పడ్డాడు. నాదల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా నాదల్ ట్విట్టర్ లో తెలిపాడు. నాదల్ అబుదాబిలో ఓ టోర్నమెంట్ ఆడాడు. అక్కడి నుంచి తిరిగొచ్చాక తాను కరోనా బారిన పడినట్టు నాదల్ ట్వీట్ లో వెల్లడించాడు.

Mustard Oil : అవనూనెతో వంట…బరువు తగ్గటం సులువు

తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, రోజురోజుకి తన ఆరోగ్యం మెరుగవుతుందనే నమ్మకం తనకుందని చెప్పాడు. ప్రస్తుతానికి తాను ఇంట్లోనే ఉన్నట్టు తెలిపాడు. తనతో కాంటాక్ట్ అయిన అందరికి తను కరోనా బారిన పడిన విషయాన్ని తెలిపినట్టు నాదల్ వెల్లడించాడు. తన ఫ్యూచర్ టోర్నమెంట్స్ కు సంబంధించి తాను తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తానని అన్నాడు.

Sun Cooling Down: చల్లారిపోతున్న సూర్యుడు?.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఇండియన్ సైంటిస్టులు

పాదానికి గాయం కారణంగా నాదల్ చాలా రోజులుగా ఆటకు దూరంగా ఉన్నాడు. గాయానికి సర్జరీ చేయాల్సి వచ్చింది. కొత్త ఏడాదిలో జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ కి నాదల్ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాడు. ఇంతలోనే కరోనా బారిన పడ్డాడు. 35ఏళ్ల నాదల్ అబుదాబిలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ద్వారా మళ్లీ టెన్నిస్ కోర్టులో కనిపించాడు.

ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత ఇదే అతడి సెకండ్ మ్యాచ్. 20 గ్రాండ్ స్లామ్స్ టార్గెట్ గా పెట్టుకున్న నాదల్ కు.. కరోనా బారిన పడటం ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. 2022 జనవరి 17 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానుంది. ఆ సమయానికి కరోనా నుంచి కోలుకుని మళ్లీ ట్రైనింగ్ తీసుకోవడం నాదల్ కు కష్టమే.