త్వరలో వన్డేలకు ధోనీ గుడ్ బై

త్వరలో వన్డేలకు ధోనీ గుడ్ బై

Updated On : January 9, 2020 / 11:23 PM IST

ఇంతకాలం టీమిండియా వికెట్ కీపర్ ధోని రిటైర్మెంట్‌పై ఏమీ మాట్లాడని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి.. ధోని వన్డేలకు గుడ్‌బై చెబుతాడని చెప్తుండటంతో పాటు ఐపీఎల్‌లో చక్కగా రాణిస్తే ప్రపంచకప్‌ టీ20 ఎంపికలో పరిగణిస్తామని చెప్పడం వెనుక కారణం అదే ఉండొచ్చు. మరో మూడు నెలల్లో ఐపీఎల్‌ ఆరంభం కానుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ధోని బరిలో దిగడం ఖాయం. 38 ఏళ్లున్నా.. ఫిట్‌నెస్‌ పరంగా అతడికి ఎలాంటి సమస్యలు లేవు. 

నేరుగా కాకపోయినా తన అభిప్రాయంతో ఇప్పుడు రవిశాస్త్రి మాజీ కెప్టెన్‌ మనసులో మాటను చెప్పే ప్రయత్నం చేశాడు. ధోని మున్ముందు వన్డేలనుంచి పూర్తిగా తప్పుకొని టి20లపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం భారత జట్టులో అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ అతడే. ఎటొచ్చి సమస్యంతా బ్యాటింగ్‌ గురించే. 6 నెలలుగా క్రికెట్టే ఆడని అతడు ఐపీఎల్‌లో ఎలా ఆడతాడన్నది కీలకం. ఇదిలా ఉంటే దీనిపై ఎటువంటి అధికారిక సమచారం లేదు. బీసీసీఐతో చర్చించి ఆ తర్వాత వీడ్కోలు తీసుకునే పరిస్థితులే కనిపించడం లేదు. 

వన్డే ప్రపంచకప్ 2019 తర్వాత ఆర్మీక్యాంపుకు వెళ్లిన మహీ.. అంతర్జాతీయ క్రికెట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడేలేదు. ఫిట్ నెస్ సాధిస్తే టీ20 ప్రపంచకప్ గెలిచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తుండటం వాస్తవమే. ఐపీఎల్ ఏప్రిల్ నెలలో మొదలుకానుండగా టీ20 వరల్డ్ కప్ 2020 అక్టోబరులో జరగనుంది.