IPL 2024 : సీఎస్‌కే కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికపై రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు
రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా ప్రకటించడంపై టీమిడియా సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Ruturaj Gaekwad
Ravichandran Ashwin : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభానికి ముందే సంచలనం నమోదైంది. డిపెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్య నిర్ణయం తీసుకొని క్రికెట్ ప్రేమికులకు షాకిచ్చింది. గతేడాది టైటిల్ అందించిన ధోని ఈ సీజన్‌లోనూ సీఎస్కే కెప్టెన్ గా కొనసాగుతాడని అభిమానులు భావించారు. ధోని నెట్స్ లో శ్రద్దగా ప్రాక్టీస్ చేస్తుండటంతో మళ్లీ అతడే కెప్టెన్‌గా ఉంటాడని అనుకున్నారు. కానీ యువ ఆటగాడు రుతురాజ్‌కు కెప్టెన్ పగ్గాలు అప్పగిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా ప్రకటించడంపై టీమిడియా సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : CSK vs RCB: చెన్నై బోణీ.. బెంగళూరుపై ఘన విజయం
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ను ఎంపిక చేయడం తనకు ఆశ్చర్యంగా అనిపించలేదని అశ్విన్ అన్నాడు. ధోనీ గురించి నాకు బాగా తెలుసు.. అతను ఏది చేసినా ప్రాంచైజీ బాగుకోసం ఆలోచిస్తాడు. నాకు తెలిసి రుతురాజ్ తో కెప్టెన్సీ గురించి గతేడాదే ధోనీ చర్చించి ఉంటాడని అశ్విన్ పేర్కొన్నాడు. ధోనీ కుర్రాళ్లతో కూర్చొని మాట్లాడేటప్పుడు అన్ని విషయాలపై స్పందిస్తాడు. బహుషా.. బాధ్యతలు అప్పగించే ముందు.. బ్రదర్ నువ్వు సారథిగా బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండు.. కంగారు పడొద్దు నేనుకూడా అక్కడే ఉంటా అని రుతురాజ్ తో ధోనీ చెప్పే ఉంటాడని అశ్విన్ అన్నాడు.
రుతురాజ్ లోనూ ధోనీ లక్షణాలు ఉన్నాయి. అతనుకూడా ధోనీ తరహాలోనే కూల్ గా ఉంటాడు.. పరిస్థితులకు అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకోగల సత్తా రుతురాజ్ లో ఉందని రవిచంద్ర అశ్విన్ పేర్కొన్నాడు. రుతురాజ్ కు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం నాకు సంతోషంగా ఉంది.. అతడు తనకు అప్పగించిన బాధ్యతల నిర్వహణలో విజయవంతం అవుతాడని నాకు నమ్మకం ఉందని అశ్విన్ తెలిపాడు.
ఇదిలాఉంటే ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 173 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేవలం 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ 2024 టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో సీఎస్కే విజేతగా నిలిచింది.
View this post on Instagram