MS Dhoni: టీమిండియా కోసం మెంటార్ మాత్రమే కాదు.. కొత్త అవతారమెత్తిన ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. టీ20 వరల్డ్ కప్ కోసం మెంటార్ అవతారమెత్తాడు. విశ్వప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు సమ్మతించిన ధోనీ ప్రస్తుతం టీమిండియాతో యూఏఈలోనే ఉన్నాడు.

Ms Dhoni
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. టీ20 వరల్డ్ కప్ కోసం మెంటార్ అవతారమెత్తాడు. విశ్వప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు సమ్మతించిన ధోనీ ప్రస్తుతం టీమిండియాతో యూఏఈలోనే ఉన్నాడు. బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, సెక్రటరీ జైషాల ప్రయత్నం.. వరల్డ్ కప్ దక్కించుకోవాలనే ఉత్సాహం కలిసి ధోనీ ప్రాక్టీస్ నెట్స్ వరకూ అడుగులేసేలా చేసింది.
ప్రాక్టీస్ సెషన్‌లో టీమ్‌ఇండియా ఆటగాళ్లతో కలిసి త్రోడౌన్ స్పెషలిస్టు(throwdown specialist)గానూ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ అభిమానులతో పంచుకొంది. ‘టీమిండియా కొత్త ‘త్రో డౌన్ స్పెషలిస్టు మహేంద్రసింగ్ ధోనీని రివీల్ చేస్తున్నాం’ అంటూ ట్విటర్‌లో పోస్టు చేసింది.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొన్న మహీ.. కెప్టెన్‌గా చెన్నై సూపర్ కింగ్స్ ను నడిపిస్తున్నాడు. ఇటీవల ఐపీఎల్ 14వ సీజన్‌లో మరోసారి విజేతగా నిలబెట్టి సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఇప్పుడు వరల్డ్ కప్‌లో మెంటార్‌గా , మార్గనిర్దేశకుడిగా ఎంపిక చేయడం.. రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదని, దీని వెనుక బలమైన చర్చే జరిగిందని గంగూలీ చెప్పాడు.
…………………………………..: ఐపీఎల్ కొత్త టీం ఓనర్లుగా రణవీర్ – దీపికాలు!!
ఇప్పటికే రెండు వరల్డ్‌కప్‌లు అందించిన ధోనీ సహకారంతో కోహ్లీ చేతుల మీదుగా టీ20 వరల్డ్ కప్ సాధించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. కెప్టెన్ గా కోహ్లీకి ఇదే చివరి టోర్నీ.
Revealing #TeamIndia’s latest throwdown specialist! @msdhoni | #T20WorldCup ??? pic.twitter.com/COZZgV7Ba6
— BCCI (@BCCI) October 22, 2021