ప్రపంచ కప్‌ జట్టులో పంత్ సరిపోడు: సచిన్

ఇలాంటి సమయంలో రిషభ్‌ వరల్డ్‌కప్‌ ఎంపిక అనేది సరైన నిర్ణయం కాదని సచిన్ వ్యాఖ్యానించాడు. ఇప్పటికే ఇద్దరు స్పెషలిస్టు వికెట్‌ కీపర్లు ఎంఎస్‌ ధోని, దినేశ్‌ కార్తీక్‌లు ఉన్నారు. ఈ క్రమంలో పంత్‌కు కీపర్‌గా చోటు కల్పించడం భారంగా మారుతుందని వివరించాడు.

ప్రపంచ కప్‌ జట్టులో పంత్ సరిపోడు: సచిన్

Updated On : January 17, 2019 / 8:54 AM IST

ఇలాంటి సమయంలో రిషభ్‌ వరల్డ్‌కప్‌ ఎంపిక అనేది సరైన నిర్ణయం కాదని సచిన్ వ్యాఖ్యానించాడు. ఇప్పటికే ఇద్దరు స్పెషలిస్టు వికెట్‌ కీపర్లు ఎంఎస్‌ ధోని, దినేశ్‌ కార్తీక్‌లు ఉన్నారు. ఈ క్రమంలో పంత్‌కు కీపర్‌గా చోటు కల్పించడం భారంగా మారుతుందని వివరించాడు.

ప్రపంచ కప్ జట్టులో టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్‌కు చోటు దక్కడం అనుమానమేనంటున్నాడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. ప్రపంచ కప్ జట్టులో రిషబ్ పంత్ ఉంటే బాగుంటుందనేది మంచి ఆలోచనే కానీ, అది జట్టు కూర్పును అతలాకుతలం చేస్తుందని అభిప్రాయపడ్డాడు సచిన్. ఇటీవల చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌‌ను ప్రపంచ కప్ జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయని స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలపై ఇటీవల పాల్గొన్న మీడియా సమావేశంలో పాల్గొన్న సచిన్ మాట్లాడాడు. అది ఏ మాత్రం మంచి నిర్ణయం కాదనే అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. 

పంత్‌ను ప్రత్యేకంగా వికెట్ కీపర్ స్థానంలో జట్టులోకి తీసుకుంటుంది టీమిండియా మేనేజ్‌మెంట్. అయితే అలా చేయడానికి ఇప్పటికే ఇద్దరు స్పెషలిస్టు వికెట్‌ కీపర్లు ఎంఎస్‌ ధోని, దినేశ్‌ కార్తీక్‌లు ఉన్నారు. ఈ క్రమంలో పంత్‌కు కీపర్‌గా చోటు కల్పించడం భారంగా మారుతుందని వివరించాడు.  

‘రాబోయే వరల్డ్ జట్టులో రిషభ్‌ పంత్‌కు స్థానం కల్పిస్తే ఓ బ్యాట్స్‌మన్‌ను కానీ, బౌలర్‌ కానీ తీసేయాలి. ఇక్కడ రిషభ్‌ కోసం ఒక స్పెషలిస్టు బౌలర్‌ను తీయడమనేది సబబైన విషయం కాదు. పోనీ బౌలర్‌కు బదులుగా బ్యాట్స్‌మన్‌ను తప్పించి రిషభ్‌కు అవకాశమివ్వాలంటే ఆల్‌ రౌండర్‌ స్థానంలో దించాల్సి ఉంటుంది. కానీ, అది జట్టు కూర్పుపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం స్పెషలిస్టు వికెట్ కీపర్లుగా రాణిస్తున్న ధోని, దినేశ్‌ కార్తీక్‌లు బాగానే ఆడుతున్నారు. ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో వారి అనుభవంతో కీలకమైన భాగస‍్వామ‍్యాన్ని నమోదు చేసి మ్యాచ్‌ను గెలిపించారు.’ అని కొనియాడాడు.  

ఇన్నింగ్స్ ఆరంభంలో ధోని కొన్ని బంతుల్ని వృథా చేస్తూ ఉంటాడు. పిచ్‌పై అవగాహన వచ్చే క్రమంలో ఇలా డాట్‌ బాల్స్‌ ఆడటానికి ఇష్టపడతాడు. క్రమంగా మైదానంలో ఏం చేయాలనుకున్నాడో కచ‍్చితంగా చూపెట్టి తీరతాడు. గేమ్‌ను ఫినిషింగ్‌ చేసే విధానంలో మహీ శైలి విభిన్నంగా ఉంటుంది. మరో వికెట్ కీపర్ దినేశ్‌ కార్తీక్‌ కూడా మంచి బ్యాట్స్‌మన్‌. మ్యాచ్‌పై ఒత్తిడిని తగ్గిస్తూ స్టైక్‌ రొటేట్‌ చేయడంలో కార్తీక్‌కు మంచి అనుభవం ఉంది. ఇలాంటి సమయంలో రిషభ్‌ వరల్డ్‌కప్‌ ఎంపిక అనేది సరైన నిర్ణయం కాదని సచిన్ వ్యాఖ్యానించాడు.