Rohit Sharma: కోహ్లీని టార్గెట్ చేసే ఆ కామెంట్ చేశాడా.. మ్యాచ్ వైఫల్యాలపై రోహిత్ రెస్పాన్స్

 అఫ్ఘానిస్తాన్ తో మ్యాచ్ గెలిచిన అనంతరం ప్రెస్ మీట్ కు హాజరైన రోహిత్ శర్మ కామెంట్లు కోహ్లీనే టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి.

Rohit Sharma: కోహ్లీని టార్గెట్ చేసే ఆ కామెంట్ చేశాడా.. మ్యాచ్ వైఫల్యాలపై రోహిత్ రెస్పాన్స్

Rohith Sharma

Updated On : November 4, 2021 / 4:14 PM IST

Rohit Sharma: అఫ్ఘానిస్తాన్ తో మ్యాచ్ గెలిచిన అనంతరం ప్రెస్ మీట్ కు హాజరైన రోహిత్ శర్మ కామెంట్లు కోహ్లీనే టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. గత రెండు మ్యాచ్ ల వైఫల్యానికి కారణం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే అని చెప్పేశాడు. అంటే కెప్టెన్ గా ఉన్న కోహ్లీనే విమర్శించాడనడంలో నో డౌట్. మరి తన ప్రదర్శన అంతగా బాగాలేకపోవడం గురించి ఏమన్నాడో తెలుసా..

అఫ్ఘానిస్తాన్ ప్లేయర్లు జట్టు కోసం ఏం చేశారో అనేది ముఖ్యం కాదు. టోర్నీలో ఎలా ఆడారనేదే కావాలి. ఐపీఎల్ టీంలలో చేసిన దాని కంటే ఇంకాస్త ఎక్కువ కష్టపడి ఉంటే సరిపోయేది. గత మ్యాచ్ లకు అఫ్ఘాన్ తో మ్యాచ్ లకు మార్పు ఎలా వచ్చిందంటే… ప్రతి ఒక్కరి ప్రదర్శనలోనూ తేడా కనిపించింది. గత మ్యాచ్ లలో అలా లేదు. సుదీర్ఘంగా ఒకే దారిలో వెళ్తున్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడం సమస్యగా మారొచ్చు. మరోసారి అవి తప్పు అవ్వొచ్చు. అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

బుధవారం జరిగిన మ్యాచ్ లో ఎట్టకేలకు వరల్డ్ కప్ లో భారత జట్టు బోణీ కొట్టింది. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో కంగుతిన్న టీమిండియా.. అఫ్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం నమోదు చేసింది. భారత్ నిర్దేశించిన భారీ టార్గెట్ ను అప్ఘానిస్తాన్ చేధించలేకపోయింది. ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా భారత్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.

F3 Movie : కేబుల్ బ్రిడ్జిపై వెంకటేష్, వరుణ్ తేజ్ సందడి