Rome Masters: రోమ్ ఓపెన్ మాస్టర్స్.. 10వ టైటిల్ సాధించిన నాదల్
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ తన కెరీర్‌లో 88వ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–థౌజెండ్ టోర్నీలో నాదల్ చాంపియన్‌గా అవతరించాడు.

Rome Masters Rafael Nadal Wins 10th Title In Italian Capital With Victory Over Novak Djokovic
Rome Masters: Rafael Nadal 10th title : స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ తన కెరీర్‌లో 88వ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–థౌజెండ్ టోర్నీలో నాదల్ చాంపియన్‌గా అవతరించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ నాదల్ ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై 7–5, 1–6, 6–3తో గెలిచాడు. 2 గంటల 49 నిమిషాలపాటు జరిగిన ఈ పోరుతో 34 ఏళ్ల నాదల్ రోమ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గడం ఇది పదోసారి. ఆటతో తొలి సెట్ చేజిక్కించుకున్న నాదల్.. రెండో సెట్‌లో వెనుకబడ్డాడు. జొకో పదునైన సర్వీస్‌లకు బదులు చెప్పలేక సెట్ కోల్పోయాడు.
నిర్ణయాత్మక మూడో సెట్ ప్రారంభం నుంచి ఆధిపత్యం కనబర్చిన నాదల్ పవర్‌ఫుల్ బ్యాక్‌హ్యాండ్ షాట్‌లతో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. జోకో విచ్ ఎనిమిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకున్నాడు. తొమ్మిదో గేమ్‌లో నాదల్ తన సర్వీస్‌ను నిలబెట్టుకున్నాడు. సెట్‌తోపాటు మ్యాచ్‌ను నాదల్ కైవసం చేసుకున్నాడు. 34 ఏళ్ల నాదల్ రోమ్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ఇది పదోసారి. ఒకే టోర్నమెంట్‌లో నాలుగు సార్లు కనీసం 10 లేదా అంతకంటే ఎక్కువ గెలిచిన ప్లేయర్‌గా తన రికార్డులను మెరుగుపరుచుకున్నాడు.
How it started (? 2005) ➡️ How it’s going (? 2021)@RafaelNadal | #IBI21 pic.twitter.com/ofrMcVc9Ve
— ATP Tour (@atptour) May 16, 2021
స్పెయిన్ స్టార్ 2005 నుంచి 2019లలో పలు టైటిళ్లు సాధించాడు. ఒకే టోర్నమెంట్‌ను నాలుగుసార్లు 10 లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన ప్లేయర్‌గా రికార్డును నెలకొల్పాడు. నాదల్ 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్‌ను బార్సిలోనా ఓపెన్‌ను 12 సార్లు… మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీని 11 సార్లు సొంతం చేసుకున్నాడు. అత్యధిక సిరీస్ టైటిల్స్ సాధించిన ప్లేయర్‌గా 36 టైటిల్స్ సాధించిన జొకోవిచ్ రికార్డును నాదల్ సమం చేశాడు.