Shahid Kapoor: ‘ఎంఎస్ ధోనీ, కోహ్లీలను స్ఫూర్తిగా తీసుకునే సినిమా చేశా’

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ షాహిద్ కపూర్ తన రీసెంట్ సినిమాకు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలే ప్రేరణ అంటున్నాడు. త్వరలో రిలీజ్ కానున్న జెర్సీ సినిమా షూటింగ్ సమయంలో ధోనీ, కోహ్లీలనే..

Shahid Kapoor: ‘ఎంఎస్ ధోనీ, కోహ్లీలను స్ఫూర్తిగా తీసుకునే సినిమా చేశా’

Cricket

Updated On : December 28, 2021 / 1:42 PM IST

Shahid Kapoor: బాలీవుడ్ వెటరన్ యాక్టర్ షాహిద్ కపూర్ తన రీసెంట్ సినిమాకు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలే ప్రేరణ అంటున్నాడు. త్వరలో రిలీజ్ కానున్న జెర్సీ సినిమా షూటింగ్ సమయంలో ధోనీ, కోహ్లీలనే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునేవాడట. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ఆగష్టు 2020లో రిటైర్ అయిన దోనీ, టీ20 – వన్డే ఫార్మాట్లకు కెప్టెన్ గా రిటైర్ అయిన కోహ్లీలే తనకు ఆదర్శం అంటున్నాడు.

మృనాల్ ఠాకూర్, పంకజ్ కపూర్, గీతికా మెహంద్రూలు కలిసి నటించిన జెర్సీ శుక్రవారం నుంచి స్క్రీన్స్ పైకి వస్తుంది. డిసెంబర్ 31న రిలీజ్ కానున్న ఈ సినిమాలో నటించేటప్పుడు లెజెండరీ క్రికెటర్లను తలచుకున్నానని చెప్పుకొచ్చాడు షాహిద్.

‘ఒక బ్యాట్స్ మన్ గా వాళ్లను ఇన్ స్పిరేషన్ గా తీసుకోలేకపోయా. ఎందుకంటే ప్రొఫెషనల్ క్రికెటర్ల మాదిరి ఎప్పటికీ ఆడలేం. కానీ, వారి పర్సనాలిటీ, ప్రజెన్స్ ను ట్రై చేయొచ్చు. షూట్ కోసం క్రీజులోకి నడిచే సమయంలో వారిద్దరే గుర్తుకొచ్చేవారు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఇవి కూడా చదవండి : తెలంగాణలో పెరుగుతున్న చలి-వణుకుతున్న ఏజెన్సీ గ్రామాలు

ప్రస్తుతం కోహ్లీ టెస్టు సిరీస్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా.. మహేంద్ర సింగ్ ధోనీ 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కనిపించనున్నాడు.