భారత్ నిజమైన బాస్ అని నిరూపించుకుంది: పాక్ మాజీ క్రికెటర్

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ టీ20విజయం తర్వాత టీమిండియాను పొగిడేస్తున్నాడు. బాస్ ఎవరో భారత్ నిరూపించుకుందని కొనియాడాడు. ఆదివారం నాగ్ పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ గురించి సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పందించాడు. తొలి మ్యాచ్ ఓడిపోయి ఉండొచ్చు గానీ, రెండో మ్యాచ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ బ్రిలియంట్ ప్రదర్శన కనబరిచాడని ప్రశంసించాడు.
‘భారత్ నిజమైన బాస్ ఓవరో నిరూపించింది. బంగ్లాదేశ్ తో ఆడిన తొలి మ్యాచ్ ఓడిపోయింది. కానీ, రోహిత్ శర్మ రెండో టీ20 నుంచి సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. రోహిత్ అద్భుతమైన టాలెంట్‌తో ఎంత స్కోర్ అయినా చేయగలడు. ఊహించినట్లుగానే మూడో టీ20లో గట్టి పోటీని చూశాం. 20ఏళ్ల క్రితం ఆడిన బంగ్లాదేశ్ లా కనిపించడం లేదు. బాగా ఆడారని’ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అన్నాడు.
భారత పర్యటనలో భాగంగా ఆడిన బంగ్లాదేశ్ ను తొలి సిరీస్ 2-1ఆధిక్యంతో మట్టికరిపించి విజయాన్ని దక్కించుకుంది టీమిండియా. మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడాల్సి ఉన్న బంగ్లాదేశ్.. నవంబరు 14న తొలి టెస్టు ఆడనుంది. ఇక రెండో టెస్టు మ్యాచ్‍ను డే అండ్ నైట్ టెస్టుగా ఆడేందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ ను నవంబరు 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడనున్నారు.