Sourav Ganguly: గంగూలీ పోస్ట్‌పై అభిమానుల విమర్శలు.. డిలీట్ చేసిన దాదా!

కరోనా కష్టకాలంలో సెలబ్రిటీలు ఏదైనా పోస్ట్ చేయ్యడం ఆలస్యం.. విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై విమర్శలు రాగా.. కాసేపటికి ఆ పోస్ట్ డిలీట్ చేశారు గంగూలీ.

Sourav Ganguly: గంగూలీ పోస్ట్‌పై అభిమానుల విమర్శలు.. డిలీట్ చేసిన దాదా!

Sourav Ganguly Drives A Racing Car In Dubai Deletes Post After Social Media Fla

Updated On : June 8, 2021 / 12:28 PM IST

Ganguly deletes post: కరోనా కష్టకాలంలో సెలబ్రిటీలు ఏదైనా పోస్ట్ చేయ్యడం ఆలస్యం.. విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై విమర్శలు రాగా.. కాసేపటికి ఆ పోస్ట్ డిలీట్ చేశారు గంగూలీ. ఐపీఎల్, ప్రపంచకప్ అంటూ తీరికలేకుండా గడుపుతున్న గంగూలీ, ఇటీవల దుబాయ్‌ ఆటోడ్రోమ్‌ను సందర్శించి, అక్కడ కార్ రేసింగ్‌లో పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా.. ఈ పోస్ట్‌పై విమర్శలు వ్యక్తం అయ్యాయి.

కరోనా సమయంలో ప్రజలు జీవనమే ఇబ్బందిగా ఉంటే, సాయం చెయ్యకపోగా ఎంజాయ్ చేశామంటూ పోస్ట్ పెడుతారా? అంటూ విమర్శలు రావడంతో.. పోస్ట్‌ను డిలీట్ చేశారు దాదా. ” కరోనా మహమ్మారి సమయంలో ఇలాంటి పోస్టుల వల్ల ఎవరికి ఉపయోగం.. సమాజం కోసం ఏదైనా మంచి పని చేయండి.. అప్పడు అభినందిస్తాం.. మొన్ననే కదా గుండెకు సర్జరీ జరిగింది.. మీ ఆరోగ్యం కాపాడుకోవాల్సిన సమయంలో రేసింగ్‌లు అవసరమా?” అంటూ ఘాటుగా విమర్శించారు.

Dhadha

యూఏఈలో ఐపీఎల్ 14వ సీజన్‌కు సంబంధించిన మ్యాచ్‌లు నిర్వహించేందుకు.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు దాదా. సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 15 వరకు ఐపీఎల్‌ 14వ సీజన్‌ను పూర్తి చేసేలా ప్లాన్‌ చేశాడు. ఇదే సమయంలో టీ20 ప్రపంచకప్‌ను శ్రీలంకలో జరిపేలా ప్లాన్ చేస్తున్నారు.