India vs Sri Lanka: బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఓపెనర్లుగా క్రీజులోకి ఇషాన్, శుభ్‌మన్
భారత్, శ్రీలంక మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో టీమిండియా ఈ మ్యాచు ఆడుతోంది.

India vs Sri Lanka
India vs Sri Lanka: భారత్, శ్రీలంక మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో టీమిండియా ఈ మ్యాచు ఆడుతోంది. టీమిండియా తుది జట్టులో హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, దీపక్ హూడా, అక్షర్ పటేల్, హర్షదీప్ పటేల్, శివం మావీ (మొట్టమొదటి మ్యాచు), ఉమ్రాన్ మాలిక్, యజువేంద్ర చాహెల్ ఉన్నారు.
నేటి మ్యాచులో ఓపెనర్లుగా క్రీజులోకి ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ వచ్చారు. భారత్, శ్రీలంక మధ్య మొత్తం మూడు టీ20 మ్యాచులు జరగనున్నాయి. అనంతరం ఈ నెల 10 నుంచి వన్డే మ్యాచులు జరుగుతాయి. కాగా, శ్రీలంక జట్టులో డి.శంకర, పి.నిస్సంకా, కె.మెండిస్, డి సిల్వా, అసలంక, రాజపక్ష, హసరంగా, కరుణరత్నే, తీక్షణ, కె.రాజిత, మధుశంక ఉన్నారు.
Let’s Play!
Live – https://t.co/uth38CaxaP #INDvSL @mastercardindia pic.twitter.com/eqeaUGKinI
— BCCI (@BCCI) January 3, 2023
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఫారూఖ్ అబ్దుల్లా.. రాహుల్‌తో కలిసి నడక