టీ20ల్లోకి వార్నర్, స్మిత్‌ల రీ ఎంట్రీ

టీ20ల్లోకి వార్నర్, స్మిత్‌ల రీ ఎంట్రీ

Updated On : October 25, 2019 / 8:08 AM IST

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లు అంతర్జాతీయ టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఏడాదికాలం నిషేదానికి గురయ్యారు. కొద్ది నెలల క్రితమే గడువు కాలం పూర్తవడంతో వరల్డ్ కప్ 2019 ఆడేందుకు ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ ఆమోదం తెలిపింది. 

ఆ తర్వాత మరోసారి టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు వీరిద్దరికీ పచ్చ జెండా ఊపేసింది ఆసీస్ క్రికెట్ మేనేజ్మెంట్. టీ20 ప్రపంచ కప్ దక్కించుకోలేకపోయిన ఆస్ట్రేలియా 2010లో మాత్రం అత్యుత్తమ ప్రదర్శన చూపించింది. ఈ స్టార్ ప్లేయర్లు దూరమైనప్పటి నుంచి జట్టుకు ఫామ్ లోపించడంతో మరోసారి అదే 14మందితో కూడిన బృందాన్ని బరిలోకి దింపాలని చూస్తోంది. 

స్మిత్‌కు జీవిత కాల కెప్టెన్సీ నిషేదం ఉండటంతో ఆరోన్ ఫించ్ కెప్టెన్సీ బాధ్యతలు కొనసాగించనున్నాడు. వార్నర్ ఇటీవల టెస్టు ఫార్మాట్ లో ఫెయిలవుతున్న టీ20 స్పెషలిస్టుగా పేరొందడంతో వార్నర్ కు ప్రాధ్యాన్యం ఇచ్చారు. సొంతగడ్డపై ఆసీస్ ప్లేయర్లు బాగా రాణిస్తారనే ఆశాభావాన్ని ఆసీస్ చీఫ్ సెలక్టర్ వ్యక్తం చేస్తున్నారు. 

ఆస్ట్రేలియా జట్టు: Aaron Finch (c), Ashton Agar, Alex Carey, Pat Cummins, Glenn Maxwell, Ben McDermott, Kane Richardson, Steve Smith, Billy Stanlake, Mitchell Starc, Ashton Turner, Andrew Tye, David Warner, Adam Zampa