HCA : హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి సమ్మర్ క్యాంప్స్..
హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి సమ్మర్ క్యాంప్స్‌ను ప్రారంభించనున్నట్లు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ తెలిపారు.

Summer camps from 20th of this month under the auspices of HCA
Hyderabad Cricket Association : హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి సమ్మర్ క్యాంప్స్‌ను ప్రారంభించనున్నట్లు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ తెలిపారు. ఈ నెల 15 నుంచి ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. సమ్మర్ క్యాంప్స్‌ను ఫ్రీగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన క్యాంప్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో 3 చోట్ల సమ్మర్ క్యాంప్స్‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు.
ఇందుకోసం ప్రతి జిల్లాకు రూ.15లక్షల నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. క్యాంప్స్ కు అనుగుణంగా కోచులు లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నామన్నారు. సమ్మర్ క్యాంప్స్ తర్వాత జిల్లా స్థాయి టోర్నమెంట్‌ను నిర్వహిస్తామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తామన్నారు. ప్రైవేట్ క్యాంప్స్ లో రూ.5 వేల వరకు ఛార్జ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
Arjun Tendulkar : దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మలింగ స్పెషల్ ట్రైనింగ్..!
త్వరలోనే ఉచితంగా స్పోర్ట్స్ అకాడమి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక స్టేడియం విషయానికి వస్తే.. అన్ని సౌకర్యాలు మెరుపడ్డాయని, పవర్ సప్లై సమస్య క్లియర్ అయిందన్నారు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో హైదారాబాద్ ప్లేయర్స్ ఉండేలా చూస్తామన్నారు. ప్రభుత్వ విభాగాల నుంచి టికెట్లు ఎక్కువగా అడగడంతోనే ఇబ్బంది వస్తోందన్నారు.