రవిశాస్త్రి వల్లే ఇదంతా, టెస్టు క్రికెట్ భారమంతా భారత్‌దే: కోహ్లీ
టెస్టు క్రికెట్‌లో కొద్ది సంవత్సరాలుగా మనం శక్తిమంతంగా తయారవుతున్నాం. భారత క్రికెట్ టెస్టు క్రికెట్‌పై ఆదరణ చూపిస్తే టెస్టు క్రికెట్ సజీవంగా ఉంటుందనుకుంటున్నాను. అభిమానులపరంగా టాప్ స్థానంలో ఉండే భారత్.. ఆదరణపైనే అంతా ఆధారపడి ఉంది.

టెస్టు క్రికెట్‌లో కొద్ది సంవత్సరాలుగా మనం శక్తిమంతంగా తయారవుతున్నాం. భారత క్రికెట్ టెస్టు క్రికెట్‌పై ఆదరణ చూపిస్తే టెస్టు క్రికెట్ సజీవంగా ఉంటుందనుకుంటున్నాను. అభిమానులపరంగా టాప్ స్థానంలో ఉండే భారత్.. ఆదరణపైనే అంతా ఆధారపడి ఉంది.
టెస్టు క్రికెట్ భవితవ్యమంతా భారత అభిమానులపైనే ఆధారపడి ఉందంటున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో క్రికెట్‍పై చూపేంత అభిమానం మరెక్కడ ఉండదని కొనియాడాడు. ఇదే స్థాయిలో ఆదరణ చూపిస్తే సంప్రదాయ క్రికెట్ సజీవంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు కోహ్లీ. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న విరాట్ టెస్టు క్రికెట్ గురించి ఇలా చెప్పుకొచ్చాడు.
‘నేను ఇది మనం సాధించిన లక్ష్యమని చెప్పడం లేదు. క్రమంగా మనం సాధిస్తున్న వృద్ధిని బట్టి మనమేంటో తెలుస్తోంది. టెస్టు క్రికెట్‌లో కొద్ది సంవత్సరాలుగా మనం శక్తిమంతంగా తయారవుతున్నాం. భారత క్రికెట్ టెస్టు క్రికెట్‌పై ఆదరణ చూపిస్తే టెస్టు క్రికెట్ సజీవంగా ఉంటుందనుకుంటున్నాను. అభిమానులపరంగా టాప్ స్థానంలో ఉండే భారత్.. ఆదరణపైనే అంతా ఆధారపడి ఉంది.’
‘కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్‌నే లక్ష్యం చేసుకోకుండా సుదీర్ఘ ఫార్మాట్‌పైనా దృష్టి సారించాలి. కేవలం షార్ట్ ఫార్మాట్‌లకే అలవాటుపడితే మానసికంగా ఎదగలేరు. యువతరం ఆటను అలవాటు చేసుకోలేరు. షార్ట్ ఫార్మాట్‌లు ముఖ్యమైనవే కానీ, వాటికే ప్రాధాన్యమిస్తూ పోతే ఐదు రోజుల పాటు ఆడగలిగే సామర్థాన్ని సాధించలేరు. రెండు గంటలపాటు ఒక్క పరుగు కూడా చేయకపోయినా మైదానంలో నిల్చొగలిగే సహనాన్ని అలవరచుకోవాలి. అటువంటి ఆటతీరును అలవరుచుకుంటేనే తర్వాతి తరానికి చక్కని క్రికెట్‌ను అందించగలం’
పనిలో పనిగా సిరీస్ వైఫల్యాల సమయంలో కెప్టెన్‌తో పాటు సమాన స్థాయిలో విమర్శలలోనూ పాలుపంచుకునే టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రిని పొగిడేశాడు. ‘కోచ్ రవి శాస్త్రి వల్లనే 2014వ సంవత్సరంలో ప్రపంచ నెం.7ర్యాంకులో ఉన్న భారత్ ఇప్పుడు అగ్రస్థానంలో కొనసాగుతుంది. రవి శాస్త్రి నేతృత్వంలోనే భారత ప్లేయర్ల ఆటతీరులో మార్పు వచ్చింది. మైదానంలో ఉత్తేజభరితంగా ఉండేలా ప్రోత్సహిస్తాడు. ఏ ఫార్మాట్ అయినా నిర్భయంగా ఎదుర్కొనేలా సిద్ధం చేస్తాడు. ప్రస్తుత విజయంలో అతని పాత్ర కీలకం’ అంటూ ముగించాడు.