Rishabh Pant: రిషబ్ పంత్‌లా ధైర్యంగా ఉండాలనుకుంటున్నా – జోస్ బట్లర్
షార్ట్ ఫార్మాట్ వరల్డ్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్ జట్టుతో వచ్చే నెలలో యాషెస్ సిరీస్ ఆడనుంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా జరిగే ఈ మ్యాచ్ లు 2021 డిసెంబర్ 8 నుంచి.....

Rishabh Pant
Rishabh Pant: టీ20 వరల్డ్ కప్ 2021 ముగిసింది. కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ హడావుడి మొదలుకానుంది. షార్ట్ ఫార్మాట్ వరల్డ్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్ జట్టుతో వచ్చే నెలలో యాషెస్ సిరీస్ ఆడనుంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా జరిగే ఈ మ్యాచ్ లు 2021 డిసెంబర్ 8 నుంచి మొదలుకానున్నాయి. ఈ సిరీస్ సందర్భంగా పంత్ పర్‌ఫార్మెన్స్‌ను గుర్తు చేసుకున్నాడు ఇంగ్లీష్ క్రికెటర్ జోస్ బట్లర్.
ఆస్ట్రేలియాలో రిషబ్ పంత్ బ్యాటింగ్ స్టైల్‌ను తాను బాగా ఎంజాయ్ చేశానన్నాడు. పంత్ పూర్తిగా భయం లేని క్రికెటర్.. ఒత్తిడి సమయంలోనూ హెచ్చరికలు అందుతున్నా.. అగ్రెసివ్ గా ఆడగలడు. భయంలేని అదే యాటిట్యూడ్ నేనూ కొనసాగించాలనుకుంటున్నా.. యాషెస్ సిరీస్ లో సాధ్యమైనంతవరకూ ప్రయత్నిస్తా. అన్నాడు.
‘గత శీతాకాలంలో జరిగిన టెస్టు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా వేదికగా టీమిండియా తరపున ఆడిన పంత్ ప్రదర్శనను బాగా ఎంజాయ్ చేశా. డిఫెన్సివ్, అగ్రెసివ్ వేరియేషన్స్ తో గేమ్ ఆడగలడు. ఎలాంటి బౌలింగ్ అటాక్ కనిపించినా.. ఒకేలా కనిపిస్తాడు. గేమ్ మరింత సింపుల్ చేసేస్తాడు. టీ20 వరల్డ్ కప్ లో చూపించిన భయంలేని ప్రదర్శననే రెడ్ బాల్ క్రికెట్ లోనూ చూపించాలనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు.
…………………………………………… : మారుతితో సుప్రీం హీరో సెకండ్ సినిమా..
ఇంగ్లాండ్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ స్టేజిలో న్యూజిలాండ్ తో తలపడి ఓటమికి గురైంది.