రాక్షస కోచ్ : మ్యాచ్ ఓడారని గుండు కొట్టించాడు
మ్యాచ్ ఓడిపోయారనే నెపంతో ప్లేయర్ల గుండుకొట్టించిన ఉదంతమిది. బెంగాల్ అండర్-19 హాకీ జట్టు జబల్‌పుర్‌లో జరిగిన జాతీయ జూనియర్ బి-డివిజన్ టోర్నీ క్వార్టర్స్‌లో పరాజయం పాలైంది. నాంధారి ఎలెవన్ చేతిలో 1-5 గోల్స్‌తో బెంగాల్ ఓడిపోవడంతో ఆ జట్టు కోచ్ ఆనంద్ కుమార్ ఆగ్రహం తారాస్థాయికి చేరింది.

మ్యాచ్ ఓడిపోయారనే నెపంతో ప్లేయర్ల గుండుకొట్టించిన ఉదంతమిది. బెంగాల్ అండర్-19 హాకీ జట్టు జబల్‌పుర్‌లో జరిగిన జాతీయ జూనియర్ బి-డివిజన్ టోర్నీ క్వార్టర్స్‌లో పరాజయం పాలైంది. నాంధారి ఎలెవన్ చేతిలో 1-5 గోల్స్‌తో బెంగాల్ ఓడిపోవడంతో ఆ జట్టు కోచ్ ఆనంద్ కుమార్ ఆగ్రహం తారాస్థాయికి చేరింది. ఆగ్రహానికి గురైన కోచ్ గుండు కొట్టించుకోవాల్సిందిగా ఆటగాళ్లను ఆదేశించాడు. దీంతో గత్యంతరం లేక.. 18 మంది ఆటగాళ్లలో ఇద్దరు మినహా అందరూ గుండు గీయించుకున్నారు. ఈ సంఘటనను తీవ్రంగా తీసుకున్న బంగాల్ హాకీ సంఘం త్రిసభ్య విచారణ కమిటీని వేసింది.
అయితే, తాను అసహనంతో అన్నానే కానీ.. అలా చేయాలనేది తన ఉద్దేశం కాదని కోచ్ కుమార్ బుకాయించాడు. తన ఆదేశాన్ని ధిక్కరించి గుండు గీయించుకోవడానికి నిరాకరిస్తే ‘క్రమశిక్షణా రాహిత్యం’ అని కోచ్ ఆగ్రహించాడని ఓ ప్లేయర్ ఆరోపించాడు. కానీ, కుమార్ పట్ల గౌరవంతోనే తాము అలా చేసినట్టు మరో ప్లేయర్ తెలిపాడు. జబల్‌పూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత 18మంది జట్టు సభ్యుల్లో 16 మంది గుండు చేయించుకున్నారని.. ఇద్దరు మాత్రమే నిరాకరించారట.