Virat Kohli: ఇండియా ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ గెలవడమే నా మోటివేషన్ – విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తాను తిరిగి పరుగులు ఎలా చేయాలనుకుంటున్నాడో వివరించాడు. ఈ సీజన్ లో దారుణమైన ఆట తీరు కనబరుస్తున్న విరాట్.. 236పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీతో పాటు మూడు గోల్డెన్ డక్‌లు మూటగట్టుకున్నాడు.

Ipl 2022 Virat Kohli Teases Rcb Fans Ahead Of Captain, Other Major Announcements On March 12
Virat Kohli: ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తాను తిరిగి పరుగులు ఎలా చేయాలనుకుంటున్నాడో వివరించాడు. ఈ సీజన్ లో దారుణమైన ఆట తీరు కనబరుస్తున్న విరాట్.. 236పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీతో పాటు మూడు గోల్డెన్ డక్‌లు మూటగట్టుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ లీడింగ్ రన్ స్కోరర్ అయిన కోహ్లీ 2016లో 973 పరుగులు చేశాడు. అందులో నాలుగు సెంచరీలుకూడా ఉన్నాయి. ప్రస్తుతం తనకు ఈ ఏడాది జరగనున్న రెండు మేజర్ టోర్నమెంట్లు గెలవాలని ఉందని చెప్తున్నాడు.
“స్కోర్లు నమోదు కావడానికి ఎలా మోటివేట్ అవ్వాలో నాకు తెలుసు. నాకు ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ గెలవడమే మోటివేషన్. సమన్వయం కోసం ముందుకు కదలాలి. దాంతో పాటు కాస్త రెస్ట్ కూడా అవసరం. ఒకసారి ఆ మైండ్ సెట్ లోకి వెళ్తే మళ్లీ తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అది చాలా సరదాగా ఉంటుంది. నా ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఇండియా.. ఆసియా కప్, వరల్డ్ కప్ గెలవడానికి కృషి చేయడమే”
Read Also: విరాట్, రోహిత్‌ల ఫామ్‌పై బేఫికర్ అంటోన్న గంగూలీ
“చాలా మంది ఏం చెప్పారనేది కాదు. రవి భాయ్ నన్ను చాలా దగ్గర్నుంచి చూశాడు. ఐపీఎల్ లో, మూడు ఫార్మాట్ల క్రికెట్ లో 10-11 ఏళ్లుగా చూస్తున్నాడు. నిజంగా జీవితానికి ఒక బ్రేక్ అవసరం. ఇది చాలా మంచి నిర్ణయం. మానసికంగా, శారీరకంగా కోలుకోవాల్సి ఉంది” అని విరాట్ వివరించాడు.