అశ్విన్ దెబ్బకి వార్నర్ వెనక్కి పరిగెత్తాడు

ఐపీఎల్ లో మాన్కడింగ్ ఓ పెను వివాదమే రేపింది. బౌలర్ కాసేపు ఆగితే ఎక్కడ అవుట్ చేస్తాడోనని భయంతో బ్యాట్స్ మన్ వణికిపోతున్నారు.

అశ్విన్ దెబ్బకి వార్నర్ వెనక్కి పరిగెత్తాడు

Updated On : April 9, 2019 / 4:53 AM IST

ఐపీఎల్ లో మాన్కడింగ్ ఓ పెను వివాదమే రేపింది. బౌలర్ కాసేపు ఆగితే ఎక్కడ అవుట్ చేస్తాడోనని భయంతో బ్యాట్స్ మన్ వణికిపోతున్నారు.

ఐపీఎల్ లో మాన్కడింగ్ ఓ పెను వివాదమే రేపింది. బౌలర్ కాసేపు ఆగితే ఎక్కడ అవుట్ చేస్తాడోనని భయంతో బ్యాట్స్ మన్ వణికిపోతున్నారు. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ .. జోస్ బట్లర్ ను అవుట్ చేసిన విధానం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఐపీఎల్ మొత్తానికి గుర్తుండిపోయేలా అయింది మాన్కడింగ్. 
Read Also : హమ్మయ్య: పాండ్యాకు గుడ్ న్యూస్

మొహాలీ వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో మరోసారి అశ్విన్ ఇదే తరహా ప్రదర్శన చేయబోయాడు. అయితే అప్పటికీ అప్రమత్తమైన డేవిడ్ వార్నర్ వెనక్కి పరుగులంకించుకున్నాడు. బ్యాట్ తీసుకుని వచ్చి క్రీజులో పెట్టేందుకు ఆపసోపాలు పడ్డాడు. అది చూసిన అశ్విన్ ముసిముసి నవ్వులతో బౌలింగ్ పై దృష్టి పెట్టాడు. ఈ వీడియోను ఐపీఎల్ తన అధికారిక వెబ్ సైట్ లో పోస్టు చేసింది. 

పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఖాతాలో 8 పాయింట్లు చేరడంతో లీగ్ పట్టికలో 3వ స్థానానికి చేరింది.