Wimbledon : 20వ గ్రాండ్‌స్లామ్‌కు అడుగు దూరంలో
వింబుల్డన్ ఓపెన్ ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది. సెర్బియా లెజెండ్ నొవాక్ జకోవిక్‌తో ఇటలీ ప్లేయర్ బెరేట్టిని తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో విక్టరీ కొట్టి కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్ సాధించాలని జకోవిక్ టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఒకవేళ అదే జరిగితే ఈ రికార్డు సాధించిన టెన్నిస్ గ్రేట్స్ ఫెడరర్, నాదల్ సరసన జకో నిలుస్తాడు.

Novak Djokovic And Matteo Berrettini
Novak Djokovic And Matteo Berrettini : వింబుల్డన్ ఓపెన్ ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది. సెర్బియా లెజెండ్ నొవాక్ జకోవిక్‌తో ఇటలీ ప్లేయర్ బెరేట్టిని తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో విక్టరీ కొట్టి కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్ సాధించాలని జకోవిక్ టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఒకవేళ అదే జరిగితే ఈ రికార్డు సాధించిన టెన్నిస్ గ్రేట్స్ ఫెడరర్, నాదల్ సరసన జకో నిలుస్తాడు. అనుభవం, ప్రస్తుత ఫామ్ చూస్తే బెరేట్టినిపై జకో గెలవడం ఖాయంగా కనిపిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు బెరేట్టిని కెరీర్‌లో తొలిగ్రాండ్ స్లామ్‌పై కన్నేశాడు. 25ఏళ్ల ఈ టాలెంటెడ్ ప్లేయర్ అంత ఈజీగా తలొగ్గే రకం కాదు.
Read More : Journalist: జర్నలిస్టును చెంపదెబ్బ కొట్టిన చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్
భారీ సర్వీసులతో ఎలాంటి ప్రత్యర్థికైనా సవాల్ విసురురుతాడు. పైగా గ్రాస్ కోర్టులో బెరేట్టిని వరుసగా 11సార్లు విజయం సాధించాడు. ఇదిలా ఉంటే…వింబుల్డన్‌లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంకర్ బార్టీ సంచలనం సృష్టించింది. 41 ఏళ్ల తర్వాత మహిళల సింగిల్స్ గెలిచిన ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా రికార్డు క్రియెట్ చేసింది. సెంటర్ కోర్టులో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో కరోలినాపై వరల్డ్ నెంబర్ 1 బార్టీ చాంపియన్‌గా నిలిచింది. వింబుల్డన్‌లో 1980 తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఆస్ట్రేలియన్ ప్లేయర్ కూడా చాంపియన్ కాలేదు. ఆ రికార్డును బార్టీ బద్దలు కొట్టింది.