Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. రికార్డులే రికార్డులు..
టీమ్ఇండియా స్టార్ ప్లేయర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) అరుదైన ఘనత సాధించింది
Womens Asia Cup 2026 India vs Hong Kong Smriti Mandhana breaks Mithali Rajs record
Smriti Mandhana : టీమ్ఇండియా స్టార్ ప్లేయర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. ఆసియాకప్ 2026లో భాగంగా గురువారం హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో మంధాన 64 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 124 పరుగులు సాధించింది. ఈ క్రమంలో మహిళల క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా, అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది.
స్మృతి మందాన మూడు ఫార్మాట్లలో కలిపి మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఆమె భారత దిగ్గజ ప్లేయర్ మిథాలీ రాజ్‌ను అధిగమించింది. 333 ఇన్నింగ్స్‌ల్లో మిథాలీ 10868 పరుగులు చేయగా మంధాన 303 ఇన్నింగ్స్‌ల్లోనే 10880 పరుగులు సాధించింది. మంధాన వన్డేల్లో 5411 పరుగులు, టీ20ల్లో 4681 పరుగులు, టెస్టుల్లో 788 పరుగులు సాధించింది.
మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే..
* స్మృతి మంధాన (భారత్) – 303 ఇన్నింగ్స్‌ల్లో 10880 పరుగులు
* మిథాలీ రాజ్ (భారత్) – 333 ఇన్నింగ్స్‌ల్లో 10868 పరుగులు
* సుజీ బేట్స్ (న్యూజిలాండ్) – 370 ఇన్నింగ్స్‌ల్లో 10740 పరుగులు
* షార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్) – 309 ఇన్నింగ్స్‌ల్లో 10273 పరుగులు
🚨 Record Alert 🚨
Smriti Mandhana is now the leading run-getter in women’s internationals 🫡🫡
She surpasses former #TeamIndia captain Mithali Raj 👏👏#WomensAsiaCup | #INDvHK pic.twitter.com/qqxNYJcunz
— BCCI Women (@BCCIWomen) September 3, 2026
అత్యధిక సెంచరీలు..
ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా మహిళల క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా స్మృతి మంధాన నిలిచింది. తాజా సెంచరీ మంధానకు అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలలో) 18వ శతకం. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్లానింగ్ను అధిగమించింది.
Number 1️⃣8️⃣ with her 1️⃣8️⃣th Hundred 😎
Vice-captain Smriti Mandhana topping the charts 💯#TeamIndia | #WomensAsiaCup | #INDvHK pic.twitter.com/amvoLOKuMl
— BCCI Women (@BCCIWomen) September 3, 2026
మహిళల క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు..
* స్మృతి మంధాన – 18 సెంచరీలు
* మెగ్ లానింగ్ – 17 సెంచరీలు
* లారా వోల్వార్ట్ – 17 సెంచరీలు
తొలి ప్లేయర్‌గా..
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో రెండు సెంచరీలు చేసిన ఏకైక భారత మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన రికార్డులకు ఎక్కింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టీ20ల్లో ఓ సెంచరీ చేసింది. మంధాన, హర్మన్ తప్ప మరో భారత ప్లేయర్ టీ20ల్లో సెంచరీ చేయలేదు.
మహిళల టీ20 ఆసియా కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు..
మహిళల ఆసియాకప్ టీ20 క్రికెట్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్‌గా మంధాన నిలిచింది. ఈ క్రమంలో లంక ప్లేయర్ చమరి ఆటపట్టును అధిగమించింది. చమరి ఆటపట్టు మలేషియా పై 120 నాటౌట్‌గా నిలిచింది.
