World Cup 2023 ENG vs NZ : ప్ర‌పంచ‌క‌ప్‌లో శుభారంభం చేసిన న్యూజిలాండ్‌.. ఇంగ్లాండ్ పై విజ‌యం

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చింది. వ‌న్డే ప్ర‌పంచ‌క 2023 తెర‌లేచింది. మొద‌టి మ్యాచులో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి.

World Cup 2023 ENG vs NZ : ప్ర‌పంచ‌క‌ప్‌లో శుభారంభం చేసిన న్యూజిలాండ్‌.. ఇంగ్లాండ్ పై విజ‌యం

World Cup 2023 ENG vs NZ

Updated On : October 5, 2023 / 8:43 PM IST

 ప్ర‌పంచ‌క‌ప్‌లో శుభారంభం చేసిన న్యూజిలాండ్‌

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో న్యూజిలాండ్ జ‌ట్టు శుభారంభం చేసింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ మొద‌టి మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. 283 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 36.2 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోయి ఛేదించింది.

ర‌చిన్ ర‌వీంద్ర శ‌క‌తం

లియాన్ లివింగ్ స్ట‌న్ (30.4వ ఓవ‌ర్‌) బౌలింగ్‌లో సింగిల్ తీసి 82 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స‌ర్ల సాయంతో ర‌చిన్ ర‌వీంద్ర సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 31 ఓవ‌ర్ల‌కు న్యూజిలాండ్ స్కోరు 222/1. ర‌చిన్ ర‌వీంద్ర (100), డేవాన్ కాన్వే (119)లు ఆడుతున్నారు.

కాన్వే సెంచ‌రీ

మార్క్ వుడ్ బౌలింగ్‌లో సింగిల్ (26.1వ ఓవ‌ర్‌) తీసి డేవాన్ కాన్వే 83 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో శ‌త‌కాన్ని అందుకున్నాడు.

20 ఓవ‌ర్ల‌కు కివీస్ స్కోరు 154/1.

న్యూజిలాండ్ బ్యాట‌ర్లు టీ20 త‌ర‌హాలో బ్యాటింగ్ చేస్తున్నారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 20 ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. వికెట్ న‌ష్ట‌పోయిన కివీస్ 154 ప‌రుగులు చేసింది. రచిన్ రవీంద్ర (71), డెవాన్ కాన్వే (82) లు ఆడుతున్నారు.

కాన్వే హాఫ్ సెంచ‌రీ

ఆదిల్ ర‌షీద్ బౌలింగ్‌లో (12.4వ ఓవ‌ర్‌) ఫోర్ కొట్టి 36 బంతుల్లో డేవాన్ కాన్వే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 13 ఓవ‌ర్ల‌కు కివీస్ స్కోరు 107/1. రచిన్ రవీంద్ర (55), డెవాన్ కాన్వే (51) లు ఆడుతున్నారు.

సిక్స్‌తో ర‌వీంద్ర అర్థ‌శ‌త‌కం..

మొయిన్ అలీ బౌలింగ్‌లో (11.5వ ఓవ‌ర్‌) సిక్స్‌తో 36 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు ర‌చిన్ ర‌వీంద్ర‌. అత‌డి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు ఉన్నాయి.

10 ఓవ‌ర్ల‌కు న్యూజిలాండ్ స్కోరు 81/1

కివీస్ బ్యాట‌ర్లు దూకుడుగా ఆడుతున్నారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 10 ఓవ‌ర్లు ముగిశాయి. కివీస్ వికెట్ న‌ష్ట‌పోయి 81 ప‌రుగులు చేసింది. రచిన్ రవీంద్ర (47), డెవాన్ కాన్వే (33) లు ఆడుతున్నారు.

ఒకే ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు

వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర దూకుడుగా ఆడుత‌న్నారు. ఏడో ఓవ‌ర్‌ను మార్క్ వుడ్ వేయ‌గా మొద‌టి బంతికి కాన్వే ఫోర్ కొట్ట‌గా ఆఖ‌రి రెండు బంతుల‌ను ర‌వీంద్ర సిక్స్‌, ఫోర్‌గా మ‌లిచాడు. 7 ఓవ‌ర్ల‌కు కివీస్ స్కోరు 54/1. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 17 ప‌రుగులు వ‌చ్చాయి. రచిన్ రవీంద్ర (34), డెవాన్ కాన్వే (19) లు ఆడుతున్నారు.

5 ఓవ‌ర్ల‌కు కివీస్ స్కోరు 27/1

ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన‌ప్ప‌టికీ కివీస్ బ్యాట‌ర్లు నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. 5 ఓవ‌ర్ల‌కు కివీస్ స్కోరు 27/1. రచిన్ రవీంద్ర (16), డెవాన్ కాన్వే (11) లు ఆడుతున్నారు.

విల్ యంగ్ డ‌కౌట్‌

ఓ మోస్త‌ర్ ల‌క్ష్యాన్ని చేదించేందుకు బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్‌కు షాక్ త‌గిలింది. సామ్ కర్రాన్ బౌలింగ్‌లో బ‌ట్ల‌ర్ క్యాచ్ అందుకోవ‌డంతో విల్ యంగ్ (0) డ‌కౌట్ అయ్యాడు. దీంతో 1.1వ ఓవ‌ర్‌లో 10 ప‌రుగుల వ‌ద్ద న్యూజిలాండ్ మొద‌టి వికెట్ కోల్పోయింది. 2 ఓవ‌ర్ల‌కు న్యూజిలాండ్ స్కోరు 10/1. రచిన్ రవీంద్ర (0), డెవాన్ కాన్వే (10) లు ఆడుతున్నారు.

న్యూజిలాండ్ టార్గెట్ 283

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 మొద‌టి మ్యాచులో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 282 ప‌రుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట‌ర‌లో జో రూట్ (77; 86 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్‌) ఒక్క‌డే అర్థశ‌త‌కంతో రాణించాడు. మిగిలిన వారిలో జోస్ బ‌ట్ల‌ర్ (43; 42 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), జానీ బెయిర్ స్టో (33; 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) లు ఫ‌ర్వాలేద‌నిపించగా డేవిడ్ మ‌ల‌న్ (14), మొయిన్ అలీ (11), లివింగ్ స్టోక్ (20), హ్యారీ బ్రూక్ (25) లు విఫ‌లం అయ్యారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో మాట్ హెన్రీ మూడు వికెట్లు తీయ‌గా మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ లు చెరో రెండు వికెట్లు, ట్రెంట్ బౌల్డ్‌, రచిన్ రవీంద్ర లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

వోక్స్ ఔట్‌.. 

ఇంగ్లాండ్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోతుంది. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో విల్ యంగ్‌కు క్యాచ్ అందుకోవ‌డంతో క్రిస్ వోక్స్ (11; 12 బంతుల్లో 1 ఫోర్‌) ఔట్ అయ్యాడు. దీంతో 44.6వ ఓవ‌ర్‌లో 250 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 45 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 250/8. సామ్ కర్రాన్ (13), ఆదిల్ రషీద్ (0) లు ఆడుతున్నారు.

జో రూట్‌ క్లీన్ బౌల్డ్‌..

ఇంగ్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. గ్లెన్ ఫిలిఫ్స్ బౌలింగ్‌లో జో రూట్ (77; 86 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్‌) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 41.1వ ఓవ‌ర్‌లో 229 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. 42 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 235/7. సామ్ కర్రాన్ (1), క్రిస్ వోక్స్ లు ఆడుతున్నారు.

లివింగ్ స్టోన్ ఔట్‌.. ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌

ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో మాట్ హెన్రీ క్యాచ్ ప‌ట్టుకోవ‌డంతో లియామ్ లివింగ్‌స్టోన్ (20; 22 బంతుల్లో 3ఫోర్లు) ఔట్ అయ్యాడు. దీంతో 38.5 ఓవ‌ర్‌లో 221 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండో ఆరో వికెట్ కోల్పోయింది. 40 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 224/6. జో రూట్ (74), సామ్ కర్రాన్ (1) లు ఆడుతున్నారు.

బ‌ట్ల‌ర్ ఔట్‌.. ఐదు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డ ఇంగ్లాండ్‌

ఇంగ్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. మాట్ హెన్రీ బౌలింగ్‌లో టామ్ లాథ‌మ్ క్యాచ్ అందుకోవ‌డంతో కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ (43; 42 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 33.2వ ఓవ‌ర్‌లో 188 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 34 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 191/5. జో రూట్ (60), లియామ్ లివింగ్‌స్టోన్ (2) లు ఆడుతున్నారు.

రూట్ అర్థ‌శ‌త‌కం

ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో (29.4వ ఓవ‌ర్‌)లో సింగిల్ తీసి జో రూట్ 57 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో హాఫ్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. 30 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 166/4. బ‌ట్ల‌ర్ (30), జో రూట్ (50) లు ఆడుతున్నారు.

మొయిన్ అలీ క్లీన్ బౌల్‌..

గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో మొయిన్ అలీ (11; 17 బంతుల్లో 1ఫోర్‌) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 21.2 వ ఓవ‌ర్‌లో 118 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 22 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 121/4. బ‌ట్ల‌ర్ (2), జో రూట్ (33)లు ఆడుతున్నారు.

హ్యారీ బ్రూక్ ఔట్‌

ఇంగ్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో డెవాన్ కాన్వే క్యాచ్ అందుకోవ‌డంతో హ్యారీ బ్రూక్ (25; 16 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఔట్ అయ్యాడు. దీంతో 16.6వ ఓవ‌ర్‌లో 94 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 14 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 94/3. జో రూట్ (20), మొయిన్ అలీ(0) లు ఆడుతున్నారు.

ఇంగ్లాండ్ కు భారీ షాక్‌.. జానీ బెయిర్ స్టో ఔట్‌

ఇంగ్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ క్యాచ్ అందుకోవ‌డంతో జానీ బెయిర్ స్టో (33; 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఔట్ అయ్యాడు. దీంతో 12.5వ ఓవ‌ర్‌లో 64 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 13 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 64/2. జో రూట్ (15), హ్యారీ బ్రూక్ (0) లు ఆడుతున్నారు.

10 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 51/1.

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో మొద‌టి 10 ఓవ‌ర్లు ముగిశాయి. ఇంగ్లీష్ జ‌ట్టు వికెట్ న‌ష్ట‌పోయి 51 ప‌రుగులు చేసింది. జానీ బెయిర్ స్టో (31), జో రూట్ (4) లు ఆడుతున్నారు.

ఇంగ్లాండ్‌కు మొద‌టి షాక్‌.. డేవిడ్ మ‌ల‌న్ ఔట్‌

ఇంగ్లాండ్ జ‌ట్టు మొద‌టి వికెట్ కోల్పోయింది. మాట్ హెన్రీ బౌలింగ్‌లో డేవిడ్ మ‌ల‌న్ (14 24 బంతుల్లో 2 ఫోర్లు) టామ్ లాథ‌మ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 7.4వ ఓవ‌ర్‌లో 40 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది.

5 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 26/0

ఇంగ్లాండ్ జ‌ట్టు ఓపెన‌ర్లు నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. మొద‌టి 5 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఇంగ్లాండ్ స్కోరు 26/0. డేవిన్ మ‌ల‌న్ (13), జానీ బెయిర్ స్టో (12) ఆడుతున్నారు.

రెండో బంతికి సిక్స్‌.. ఐదో బంతికి ఫోర్‌

ఇటీవ‌ల కాలంలో ఇంగ్లాండ్ జ‌ట్లు బ‌జ్‌బాల్ విధానాన్ని అనుస‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ‌క‌ప్‌లో సైతం ఇదే విధానంలో ఆడతామ‌ని ఇంగ్లాండ్ కెప్టెన్ బ‌ట్ల‌ర్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. అందుకు త‌గ్గ‌ట్లునే ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆరంభమైంది. మొద‌టి ఓవ‌ర్‌ను బౌల్ట్ వేయ‌గా రెండో బంతిని సిక్స్‌గా మలిచిన బెయిర్ స్టో ఐదో బంతికి ఫోర్ కొట్టాడు. మొత్తంగా తొలి ఓవ‌ర్‌లో ఇంగ్లాండ్ 12 ప‌రుగులు చేసింది. 1 ఓవ‌ర్‌కు ఇంగ్లాండ్ స్కోరు 12/0. జానీ బెయిర్ స్టో (11), డేవిడ్ మ‌ల‌న్ (1) లు ఆడుతున్నారు.

ఇంగ్లాండ్ తుది జ‌ట్టు : జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

న్యూజిలాండ్ తుది జ‌ట్టు : డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్‌), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, జేమ్స్ నీషమ్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్

World Cup 2023 England vs New Zealand : క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చింది. వ‌న్డే ప్ర‌పంచ‌క 2023 తెర‌లేచింది. మొద‌టి మ్యాచులో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌కు అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం వేదికైంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ టామ్ లాథ‌మ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ను ఇంగ్లాండ్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ఆల్‌రౌండ‌ర్ బెన్‌స్టోక్స్ లేకుండానే ఇంగ్లాండ్ బ‌రిలోకి దిగింది. అటు రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గైర్హాజరీలో టామ్‌ లాథమ్ కివీస్‌కు సారథ్యం వ‌హిస్తున్నాడు.