WPL 2023, DELHI VS UP LiveUpdates In Telugu: యూపీపై ఢిల్లీ ఘన విజయం
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన యూపీ వారియర్స్ ఫీల్డింగ్ చేసింది.

WPL 2023, DELHI VS UP LiveUpdates In Telugu
WPL 2023, DELHI VS UP LiveUpdates In Telugu:
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఘన విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో యూపీని చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన యూపీ వారియర్స్ మొదట ఫీల్డింగ్ చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో మెగ్ లాన్నింగ్ 70, జెస్ 42 పరుగులతో రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ చేసింది.
212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ జట్టు.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూపీ జట్టులో తహిళ మెక్ గ్రాత్ ఒంటరి పోరాటం చేసింది. అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 50 బంతుల్లోనే 90 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఆమె స్కోర్ లో 11 పోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. మెక్ గ్రాత్ చెలరేగి ఆడినా.. ఓవర్లు లేకపోవడంతో ఓటమి తప్పలేదు.
Meg Lanning led from the front for @DelhiCapitals with 70 off just 42 deliveries and she becomes our ? Performer from the first innings ?
Scorecard ? https://t.co/Yp7UtgDSsl#TATAWPL | #DCvUPW
Take a look at her batting summary ? pic.twitter.com/ZphuDvZpRn
— Women’s Premier League (WPL) (@wplt20) March 7, 2023
LIVE NEWS & UPDATES
-
ఢిల్లీ చేతిలో యూపీ చిత్తు.. చెలరేగిన మెక్ గ్రాత్
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఘన విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో యూపీని చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన యూపీ వారియర్స్ మొదట ఫీల్డింగ్ చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో మెగ్ లాన్నింగ్ 70, జెస్ 42 పరుగులతో రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ చేసింది.
212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ జట్టు.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూపీ జట్టులో తహిళ మెక్ గ్రాత్ ఒంటరి పోరాటం చేసింది. అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 50 బంతుల్లోనే 90 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఆమె స్కోర్ లో 11 పోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. మెక్ గ్రాత్ చెలరేగి ఆడినా.. ఓవర్లు లేకపోవడంతో ఓటమి తప్పలేదు.
-
4వ వికెట్ డౌన్
212 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన యూపీ జట్టు ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 31 పరుగులకే మూడు వికెట్లు డౌన్ అయ్యాయి. 71 పరుగుల వద్ద ఆ జట్టు నాలుగో వికెట్ ను కోల్పోయింది. దీప్తి శర్మ (20 బంతుల్లో 12 పరుగులు) ఔట్ అయ్యింది. 12 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.
-
కష్టాల్లో యూపీ.. 31 పరుగులకే 3 వికెట్లు డౌన్
212 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన యూపీ జట్టు ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 31 పరుగులకే మూడు వికెట్లు డౌన్ అయ్యాయి. 8 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది.
-
యూపీ ముందు 212 పరుగుల లక్ష్యం
యూపీ వారియర్స్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ 212 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ బ్యాటర్లలో మెగ్ లాన్నింగ్ 70, షఫాలీ వర్మ 17, కాప్ 16, రొడ్రిగ్స్ 34, అలీస్ 21, జెస్ 42 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 211 పరుగులు చేసింది.
-
నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. అలీస్ 21 పరుగులు చేసి ఔట్ అయింది. ప్రస్తుతం క్రీజులో రోడ్రిగ్స్ 13, జెస్ 6 పరుగులతో ఉన్నారు. ఢిల్లీ స్కోరు 153/4 (16 ఓవర్లకు)గా ఉంది.
-
మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయింది. మారిజాన్ కాప్ 16 పరుగులు చేసి సోఫీ బౌలింగ్ లో వెనుదిరిగిన కొద్దిసేపటికే మెగ్ లాన్నింగ్ 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయింది. ప్రస్తుతం క్రీజులో రోడ్రిగ్స్ 2, అలీస్ 7 పరుగుతో ఉన్నారు. ఢిల్లీ స్కోరు 106/2 (11.0/20)గా ఉంది.
-
2 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్లు కోల్పోయింది. మారిజాన్ కాప్ 17 పరుగులు చేసి సోఫీ బౌలింగ్ లో వెనుదిరిగింది. ప్రస్తుతం క్రీజులో మెగ్ లాన్నింగ్ 64, రోడ్రిగ్స్ 1 పరుగుతో ఉన్నారు. ఢిల్లీ స్కోరు 106/2 (11.0/20)గా ఉంది.
-
మెగ్ లాన్నింగ్ అర్ధ సెంచరీ
మెగ్ లాన్నింగ్ అర్ధ సెంచరీ బాదింది. 34 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సుల సాయంతో 53 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఆమెతో పాటు మారిజాన్ కాప్ (9) ఉంది. స్కోరు 87/1 (9.0/20).
-
తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. షఫాలీ వర్మ 17 పరుగులు చేసి మెక్ గ్రాత్ బౌలింగ్ లో ఔట్ అయింది. ప్రస్తుతం క్రీజులో మెగ్ లాన్నింగ్ 44, మారిజాన్ కాప్ 3 పరుగులతో ఉన్నారు. స్కోరు 71/1 (7.0/20)గా ఉంది.
-
తొలి రెండు ఓవర్లలో 12 పరుగులు
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు మెగ్ లాన్నింగ్, షఫాలీ వర్మ ఓపెనర్లుగా క్రీజులో వచ్చారు. తొలి రెండు ఓవర్లలో 12 పరుగులు చేశారు. ప్రస్తుతం మెగ్ లాన్నింగ్ 9, షఫాలీ వర్మ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
యూపీ జట్టు
షబ్నిమ్ ఇస్మాయిల్, అలిస్సా హీలీ, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ, దేవికా వైద్య, సోఫీ, తహ్లియా మెక్‌గ్రాత్, రణ్ నవ్‌గిరే, అంజలి సర్వాణి, శ్వేతా, సిమ్రాన్ షేక్.
-
ఢిల్లీ జట్టు
మారిజాన్ కాప్, జెస్ జోనాస్సెన్, మెగ్ లాన్నింగ్, శిఖా పాండే, రాధా యాదవ్, జెమిమా రోడ్రిగ్స్, తానియా భాటియా, అరుంధతి రెడ్డి. షఫాలీ వర్మ, తారా నోరిస్, ఆలిస్ క్యాప్సే.
-
యూపీ వారియర్స్ ఫీల్డింగ్
టాస్ గెలిచిన యూపీ వారియర్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.