WTC Final: భారత్ ఘోర ఓటమి.. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా..

చివరిరోజు టీమిండియా బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.

WTC Final: భారత్ ఘోర ఓటమి.. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా..

Wtc Final 2023 Australia

Updated On : June 11, 2023 / 6:03 PM IST

WTC Final – Aus Vs Ind: ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ మ్యాచ్ లో టీమిండియా(India)పై ఆస్ట్రేలియా (Australia) గెలుపొందింది. చివరిరోజు టీమిండియా బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఒకరి వెనుక మరొకరు పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 234 స్కోరు మాత్రమే చేయగలిగింది.

టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ 43, శుభ్‌మన్ గిల్ 18, ఛటేశ్వర్ పుజారా 27, విరాట్ కోహ్లీ 49, రహానె 46, జడేజా 0, కేఎస్ భరత్ 23, శార్దూల్ ఠాకూర్ 0, ఉమేశ్ యాదవ్ 1, షమీ 13, సిరాజ్ 1 పరుగు చేశారు.

@ICC

టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 469 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్‌లో 270/8 స్కోరు వ‌ద్ద డిక్లేర్ చేసింది. 209 పరుగులతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

@ICC

ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అతడు తొలి ఇన్నింగ్స్ లో 163, రెండో ఇన్నింగ్స్ లో 18 పరుగులు బాదాడు.

WTC Final 2023: వివాదాస్పద క్యాచ్‌పై స్పందించిన కామెరూన్ గ్రీన్.. కీలక వ్యాఖ్యలు చేసిన రికీ పాంటింగ్