మోడీ-ఇమ్రాన్‌ని అడిగి తెలుసుకోండి: గంగూలీ

మోడీ-ఇమ్రాన్‌ని అడిగి తెలుసుకోండి: గంగూలీ

Updated On : October 17, 2019 / 10:02 AM IST

బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఎన్నిక కాబోతున్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇంకా అధికారికంగా ప్రెసిడెంట్ పదవి చేపట్టకపోయినా దాదాపు ఖరారు అయిపోవడంతో అతనిని ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్-పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్ జరుగుతుందా అని అడిగిన ప్రశ్నకు తెలివైన సమాధానంతో తప్పించుకున్నాడు గంగూలీ. 

మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘మీరు ఈ ప్రశ్న మోడీని.. పాకిస్తాన్ ప్రధానిని అడగాలి. నిజమే అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే విదేశీ పర్యటనలన్నీ ప్రభుత్వ అనుమతితోనే జరుగుతాయి. అందుకని ఆ ప్రశ్నకు మా దగ్గర సమాధానం లేదు’ అని వెల్లడించాడు. 

భారత్-పాక్ ఇరు జట్ల మధ్య ఆఖరిసారిగా 2012లో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. పాక్‌లో భారత్ పర్యటించి వన్డే, టీ20 పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడింది. డై అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లు భారత్‌తో ఆడిస్తారా అని అడిగిన ప్రశ్నకు టీమ్ మేనేజ్‌మెంట్ మాట్లాడాలి. అయినా భారత్ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లలో గెలుస్తుందనే నమ్మకముందని వివరించాడు.